ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాలో గడిచిన 24 గంటల్లో 6,611 కేసులు

ABN, First Publish Date - 2020-07-06T22:21:08+05:30

రష్యా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,611 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: రష్యా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,611 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 6,87,862కు చేరింది. మొత్తం కేసుల్లో అత్యధికంగా 685 కేసులు రష్యా రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయి. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 135 మంది మరణించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,296గా ఉంది. ఇక ఒకేరోజు 3,579 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. రష్యా వ్యాప్తంగా ఇప్పటివరకు 4,54,329 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం భారత్ రష్యాను అధిగమించి మూడో స్థానానికి చేరింది. భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 6,99,402 కేసులు నమోదయ్యాయి. ఇక మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలున్నాయి.

Updated Date - 2020-07-06T22:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising