ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఐదేళ్ల బాలుడి బర్త్‌డే.. స్థానికుల సర్‌ప్రైజ్

ABN, First Publish Date - 2020-12-02T04:36:47+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అమెరికా దేశం కరోనాకు కేంద్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అమెరికా దేశం కరోనాకు కేంద్రంగా మారిపోయింది. అమెరికాలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 2.20 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి మరణించిన వారిలో టెక్సాస్‌కు చెందిన రైడెన్ అనే బాలుడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. రైడెన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాజాగా రైడెన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తల్లిదండ్రులు లేకుండా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడమేంటని అనుకుంటున్నారా? అతి చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రైడెన్‌ను చూసి స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. ఇదే సమయంలో రైడెన్ పుట్టినరోజు అని తెలుసుకున్న స్థానికులు రైడెన్ కోసం బర్త్‌డే పరేడ్‌ను నిర్వహించారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కూడా ఈ పరేడ్‌లో పాలుపంచుకున్నాయి. అనేక మంది డైనోసర్, బ్యాట్‌మ్యాన్, శాంతా క్లాస్ వేషాలు ధరించి పరేడ్‌లో పాల్గొన్నారు. బర్త్‌డే పరేడ్‌లో రైడెన్ ఎంతో ఆనందంగా గడిపాడని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-02T04:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising