ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్‌లో 48 మంది వైద్యుల రాజీనామా.. కారణం ఏంటంటే!

ABN, First Publish Date - 2020-07-06T04:37:00+05:30

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. పాక్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 48 మంది ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ పని తీరును విమర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్: పాకిస్థాన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. పాక్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 48 మంది ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ  పని తీరును విమర్శిస్తూ తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి మమమ్మారితో పోరాడుతున్న తమకు తగినన్ని రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే వైద్యులు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. డాక్టర్లకు సరిపడ రక్షణ పరికరాలు సమకూర్చడంలో పాక్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సుమారు 48 మంది డాక్టర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాగా.. వారి రాజీనామాను ఆమోదించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 2.28లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 4వేలు దాటింది. 


Updated Date - 2020-07-06T04:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising