ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు వచ్చి చిక్కుకున్న పాకిస్థానీలు.. నెలల తర్వాత..

ABN, First Publish Date - 2020-10-01T12:08:01+05:30

కరోనా కారణంగా భారత్‌లో చిక్కుకున్న 415 మంది పాకిస్థానీలు అట్టారి వాఘా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్టారి, పంజాబ్: కరోనా కారణంగా భారత్‌లో చిక్కుకున్న 415 మంది పాకిస్థానీలు అట్టారి వాఘా బోర్డర్ ద్వారా బుధవారం తమ మాతృభూమికి చేరుకున్నారు. ఇన్ని నెలల తరువాత తిరిగి తమ దేశానికి వెళ్తుండటంపై పాకిస్థానీలు ఆనందం వ్యక్తం చేశారు. తాను క్యాన్సర్ చికిత్స కోసం ఏడు నెలల క్రితం భారత్‌కు వచ్చి చిక్కుకున్నానని సురేష్ కుమార్ అనే పాకిస్థానీ చెప్పుకొచ్చాడు. ఇన్ని నెలల పాటు తాను భారత్‌లో ఉన్నప్పటికి.. ఎటువంటి అసౌకర్యానికి గురికాలేదని తెలిపాడు. అయిష్ చావ్లా అనే మరో మహిళ డెలివరీ కోసం 16 నెలల క్రితం భారత్‌కు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయింది. ఒంటరిగా వచ్చిన తాను ఇప్పుడు బిడ్డతో పాకిస్థాన్ వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా వివిధ కారణాలతో భారత్‌కు వచ్చి చిక్కుకుపోయిన వారంతా తిరిగి సురక్షితంగా తమ దేశానికి చేరుకోగలిగారు. కాగా.. కరోనా టెస్ట్ రిపోర్టులను చూపించిన వారిని మాత్రమే బోర్డర్ ద్వారా పాకిస్థాన్‌కు పంపుతున్నట్టు వాఘా బోర్డర్ దగ్గర పనిచేసే అధికారి అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్‌లు, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ చెకింగ్ చేసేందుకు బోర్డర్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2020-10-01T12:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising