ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగ భృతి కోసం ఇంత మంది అమెరికన్లు దరఖాస్తు చేశారా?

ABN, First Publish Date - 2020-04-03T03:23:03+05:30

అమెరికాలో గడిచిన మూడు వారాలను ఆర్థిక వేత్తలు అత్యంత వినాశకరమైన రోజులుగా చెబుతున్నారు. కరోనా దేశంలోకి ప్రవేశించక ముందుతో పోల్చితే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడు వేల శాతం పెరగడమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో గడిచిన మూడు వారాలను ఆర్థిక వేత్తలు అత్యంత వినాశకరమైన రోజులుగా చెబుతున్నారు. కరోనా దేశంలోకి ప్రవేశించక ముందుతో పోల్చితే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడు వేల శాతం పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోనే ఏ దేశంలో లేనన్ని కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా అనేక కంపెనీలు మూతపడటంతో.. వేలాది మంది ఉద్యోగులు ఇళ్లలకే పరిమితమయ్యారు. అమెరికాలో ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే.. ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది. నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులనేది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.


అయితే ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల కారణంగా ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా అమెరికా వ్యాప్తంగా 66 లక్షల మంది తాజాగా తమ మొదటి వారం నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసినట్టు లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఈ లెక్కల ద్వారా అమెరికా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ఆరు శాతం మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసినట్టుగా అధికారులు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా.. అమెరికాలో 2007-09 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి కోసం అత్యధికంగా 6,65,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో మాంద్యం కారణంగా 87 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. 

Updated Date - 2020-04-03T03:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising