ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా నౌకలో ముగ్గురు నావికులకు కరోనా..!

ABN, First Publish Date - 2020-03-26T05:23:10+05:30

అమెరికాకు చెందిన యూఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ నౌకలో ముగ్గురు నావికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం అధికారులు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాకు చెందిన యూఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ నౌకలో ముగ్గురు నావికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం అధికారులు వెల్లడించారు. ఈ నౌకలో మొత్తంగా 5 వేలకు పైగా సిబ్బంది ఉన్నట్టు యాక్టింగ్ నేవీ సెక్రటరీ థామస్ బీ. మాడ్లీ తెలిపారు. కరోనా సోకిన ముగ్గురు నావికులు ఎవరెవరితో మాట్లాడారో.. వారందరిని క్వారంటైన్‌కు తరలించినట్టు థామస్ పేర్కొన్నారు. కాగా.. ఈ నౌక 15 రోజుల క్రితం చివరగా వియత్నాం పోర్ట్‌లో ఆగినట్టు నేవల్ ఆపరేషన్స్ అడ్మైరల్ చీఫ్ మైక్ గిల్డే తెలిపారు. అయితే వైరస్ ఏ పోర్ట్‌లో ఆగినప్పుడు సోకిందో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. వియత్నాం పోర్టు సందర్శన సమయంలో తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, పోర్టు నుంచి వచ్చిన నావికులకు మెడికల్ పరీక్షలు కూడా నిర్వహించామని మైక్ చెప్పారు. కాగా.. ఇప్పటివరకు అమెరికా నేవీలో మొత్తంగా 86 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం శాండియాగో పోర్ట్‌లో ఉన్న యూఎస్‌ఎస్ బాక్సర్ నౌకలో గత వారం ఒక నావికుడికి కరోనా సోకినట్టు అమెరికా మీడియా వెల్లడించింది.


Updated Date - 2020-03-26T05:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising