ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోమరోస్ టూ ఇండియా వయా టాంజేనియా

ABN, First Publish Date - 2020-08-10T05:07:07+05:30

కోమరోస్‌లో చిక్కుకున్న 19 మంది భారతీయులు కొద్ది గంటల క్రితం ప్రత్యేక విమానంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొరోని: కోమరోస్‌లో చిక్కుకున్న 19 మంది భారతీయులు కొద్ది గంటల క్రితం ప్రత్యేక విమానంలో టాంజేనియాకు బయల్దేరారు. టాంజేనియాలో చిక్కుకున్న మరికొంత మంది భారతీయులతో కలిసి వీరంతా సోమవారం భారత్‌కు రానున్నారు. కరోనా నేపథ్యంలో భారతీయులు కోమరోస్‌లో చిక్కుకుపోయారని.. కోమరోస్ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే నేడు వీరంతా ఇండియాకు వెళ్లగలుగుతున్నారని అక్కడి ఇండియన్ అంబాసడర్ అభయ్ కుమార్ తెలిపారు. భారతీయులంతా జాగ్రత్తగా స్వదేశానికి చేరుకోవాలని కోరుకుంటున్నామని మడగాస్కర్, కోమరోస్‌లోని ఇండియన్ ఎంబసీలు ట్విటర్ ద్వారా తెలిపాయి. కాగా.. జూన్‌లో మడగాస్కర్‌లో చిక్కుకున్న 85 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. కోమరోస్ దేశం భారత మహాసముద్రానికి నైరుతి దిక్కున ఉంటుంది. 2019 అక్టోబర్‌లో రక్షణ ఒప్పందం చేసుకునేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోమరోస్ పర్యటనకు వెళ్లారు. ఉన్నత పదవిలో ఉండి ఈ దేశ పర్యటనకు వెళ్లిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడు అనే చెప్పాలి.

Updated Date - 2020-08-10T05:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising