ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మ‌రో 16 మంది ఎన్నారైల‌కు 'క‌రోనా'

ABN, First Publish Date - 2020-04-10T17:04:25+05:30

అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌పంచ పెద్ద‌న్న‌గా పేరొందిన అమెరికా ఇప్పుడు ఈ సూక్ష్మజీవి కార‌ణంగా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్‌: అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌పంచ పెద్ద‌న్న‌గా పేరొందిన అమెరికా ఇప్పుడు ఈ సూక్ష్మజీవి కార‌ణంగా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో వంద‌ల సంఖ్య‌లో మ‌రణాలు సంభ‌విస్తుండ‌డం అమెరిక‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా 4.65 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా బాధితులు ఉండ‌గా, 16,697 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇక న్యూయార్క్ న‌గ‌ర‌మైతే శ‌వాల దిబ్బ‌గా మారిపోయింది. ఒక్క ఈ న‌గ‌రంలోనే 1,61,504 మంది కొవిడ్-19 బారిన ప‌డ‌గా, 7,067 మంది మ‌ర‌ణించారు. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి కాలు బ‌య‌ట‌పెట్టాలంటే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అగ్ర‌రాజ్యం ప్ర‌జ‌లు క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు.


ఇదిలాఉంటే యూఎస్‌లో ఈ మ‌హ‌మ్మారి కారణంగా చ‌నిపోతున్న భారతీయుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. రెండు రోజుల కింద ఐదుగురు ఎన్నారైలు మృతి చెందగా, గురువారం నాటికి ఈ సంఖ్య 11కి చేరింది. మ‌రో 16 మంది భార‌తీయులకు కరోనా సోకింది. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఈ 16 మంది ఎన్నారైల‌ను అధికారులు క్వారంటైన్‌కు తరలించినట్టు స‌మాచారం. ఇక‌ తాజాగా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన 16 కేసులలో సుమారు 10 మంది న్యూయార్క్‌కు చెందిన వారేన‌ని అధికారులు తెలియ‌జేశారు. 


Updated Date - 2020-04-10T17:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising