ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 ఏళ్ల బాలుడికి ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన కమలా హ్యారిస్

ABN, First Publish Date - 2020-11-28T15:14:32+05:30

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ 14 ఏళ్ల టైలర్ గార్డన్ అనే బాలుడికి ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బే ఏరియాకు చెందిన టైలర్ ఇటీవల కమలా హ్యారిస్ చిత్రాన్ని తన చేతులతో వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను నవంబర్ 23న తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రతి ఒక్కరు ఆ వీడియోను రీట్వీట్ చేసి కమలా హ్యారిస్‌కు చేరేలా సహాయం చేయాలని కోరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బే ఏరియా: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ 14 ఏళ్ల టైలర్ గార్డన్ అనే బాలుడికి ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బే ఏరియాకు చెందిన టైలర్ ఇటీవల కమలా హ్యారిస్ చిత్రాన్ని తన చేతులతో వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను నవంబర్ 23న తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రతి ఒక్కరు ఆ వీడియోను రీట్వీట్ చేసి కమలా హ్యారిస్‌కు చేరేలా సహాయం చేయాలని కోరాడు. నవంబర్ 25న హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సీ క్లింటర్ ఈ వీడియోను కమలా హ్యారిస్‌కు ట్యాగ్ చేశారు. నవంబర్ 26న టైలర్‌కు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనకు ఫోన్ చేసింది కమలా హ్యారిస్ అని తెలుసుకున్న టైలర్ తెగ ఆనందపడిపోయాడు. 


‘టైలర్ ఎంత అద్భుతమైన పని చేశారు.. మీ కళాత్మకత యొక్క గొప్పతనంతో నా హృదయం నిండిపోయింది. మీరు నా చిత్రం వేయడమన్నది నాకు చాలా ప్రత్యేకమైన విషయం’ అని కమలా హ్యారిస్ టైలర్‌తో సంభాషించారు. ఈ  సంభాషణను టైలర్ ట్వీట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయిపోయింది. తనకు ఫోన్ చేసిన కమలా హ్యారిస్‌కు.. తన ట్వీట్ కమలా హ్యారిస్‌కు చేరుకునేలా సహాయం చేసిన చెల్సీ క్లింటన్‌కు ట్విటర్ ద్వారా టైలర్ ధన్యవాదాలు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కమలా హ్యారిస్ టైలర్‌కు ఫోన్ చేశారన్న విషయం తెలుసుకుని ఎంతో ఆనందించానని చెల్సీ క్లింటన్ తర్వాత ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-11-28T15:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising