ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

138 మంది భారతీయులను.. నౌక నుంచి బయటకు తీసుకురావడం కుదరదు

ABN, First Publish Date - 2020-02-14T16:03:05+05:30

డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని భారతీయుల విడుదల విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్రమంత్రి హర్షవర్థన్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని భారతీయుల విడుదల విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 వైరస్ నివారించేందుకు జపాన్ దేశం విహారనౌకలో 138 మంది భారతీయులను నిర్బంధించినందున వారిని బయటకు తీసుకురాలేమని కేంద్రమంత్రి హర్షవర్థన్ స్పష్టం చేశారు. కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్ ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించిందని, ఈ నౌకలో 3,711 మంది ఉన్నారని, వారిలో 138 మంది భారతీయులని మంత్రి చెప్పారు.


డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకు కొవిడ్ -19 వైరస్ సోకిందని, వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. నౌకలోని భారతీయుల గురించి తమ రాయబార కార్యాలయం జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొవిడ్-19 వైరస్ నివారణకు కావాల్సిన అదనపు ఔషధాలను రెండు మూడు నెలల్లో రప్పిస్తామని మంత్రి వివరించారు.

Updated Date - 2020-02-14T16:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising