ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్ చేరుకున్న 116 మంది భారతీయ నర్సులు

ABN, First Publish Date - 2020-09-26T17:58:41+05:30

కరోనా లాక్‌డౌన్ వల్ల స్వదేశంలో చిక్కుకుపోయిన 116 మంది భారతీయ నర్సుల బృందం తిరిగి కువైట్ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కరోనా లాక్‌డౌన్ వల్ల స్వదేశంలో చిక్కుకుపోయిన 116 మంది భారతీయ నర్సుల బృందం తిరిగి కువైట్ చేరుకున్నారు. వివిధ పనులపై కువైట్ నుంచి భారత్‌కు వచ్చిన వీరు మహమ్మారి ప్రభావం కారణంగా ఇక్కడే ఉండిపోయారు. తాజాగా కువైట్ ఆరోగ్యశాఖ చొరవతో వీరు అక్కడికి చేరుకున్నారు. కువైట్ చేరుకున్న 116 మంది నర్సుల బృందాన్ని అక్కడి వైద్యాధికారులు స్వాబ్ టెస్టు చేసిన అనంతరం హోం క్వారంటైన్‌కు ఆదేశించారు. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ బసిల్ అల్ సభా సూచన మేరకు వీరు కువైట్ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం కువైట్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున బాధితుల సేవల కోసం భారతీయ నర్సుల బృందాన్ని రప్పించడం జరిగిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కువైట్‌లో ఇప్పటివరకు ఈ మహమ్మారి 1,02,441 మందికి సోకింది. వీరిలో 93,562 మంది కోలుకున్నారు. 595 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2020-09-26T17:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising