ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జయించిన 100 ఏళ్ల బామ్మ.. ఇండొనేషియాలో..

ABN, First Publish Date - 2020-06-01T03:41:13+05:30

ఇండొనేషియాలో 100 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. కామ్‌తిమ్ అనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సురాబాయా: ఇండొనేషియాలో 100 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. కామ్‌తిమ్ అనే బామ్మ నెల రోజులు కరోనాతో పోరాడి విజయం సాధించింది. కరోనా లక్షణాలు కనిపించడంతో కామ్‌తిమ్‌ను నెల రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. నిత్యం తాను నర్సులతో తల్లి ఆరోగ్యం గురించి అడుగుతూ వచ్చినట్టు కామ్‌తిమ్ కూతురు సిటి అమీనా తెలిపింది. సంకల్పంతోనే తన తల్లి కరోనాను జయించగలిగిందని వైద్యులు చెప్పారని పేర్కొంది. కరోనా సోకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న వయసు పైబడిన వారికి కామ్‌తిమ్ ప్రేరణగా నిలిచిందని ఈస్ట్ జావా గవర్నర్ ఖొఫిఫా ఇందార్ అన్నారు. మరోపక్క ఇండొనేషియాలో వందేళ్ల వయసున్న వారు కరోనాను జయించడం ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కామ్‌తిమ్‌కు కరోనా ఎలా సోకిందన్న విషయం తెలియాల్సి ఉంది. కామ్‌తిమ్ అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని.. ఇరుగు పొరుగు వారు ఇంటికి రావడం వల్లే కరోనా సోకి ఉండవచ్చని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. ఇండొనేషియాలో ఇప్పటివరకు 26 వేల కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తంగా 1,613 మంది మరణించారు.

Updated Date - 2020-06-01T03:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising