ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. ధూమపానానికి గుడ్ బై చెబుతున్నారు..!

ABN, First Publish Date - 2020-07-16T05:56:12+05:30

కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా.. కొవిడ్-19 భయంతో బ్రిటన్‌లో చాలా మంది స్మోకింగ్ అలవాటుకు గుడ్ బై చెబుతున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా వైరస్.. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా.. కొవిడ్-19 భయంతో బ్రిటన్‌లో  చాలా మంది స్మోకింగ్ అలవాటుకు గుడ్ బై చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా.. స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి కరోనా వల్ల ప్రాణహాని ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో సుమారు 10లక్షల మంది స్మోకింగ్‌ను మానేసినట్లు సర్వేలో వెల్లడైంది.  యాక్షన్ ఆన్ స్మోకింగ్ అండ్ హెల్త్ మరియు యూనివర్సిటీ కాలేజ్ లండన్ సంయుక్తంగా బ్రిటన్‌లో నిర్వహించిన సర్వేలో కరోనా విజృంభణ మొదలైనప్పటి నంచి గత నాలుగు నెలల్లో  సుమారు 10లక్షల మంది స్మోకింగ్‌కు గుడ్‌ బై చెప్పినట్లు వెల్లడైంది. స్మోకింగ్‌కు గుడ్ బై చెప్పిన వారిలో యువత శాతమే ఎక్కవగా ఉన్నట్లు సమాచారం. మరో 44వేల మంది కూడా ధూమపానాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 2.91లక్షలకు చేరింది. 45వేల మంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో బ్రిటన్ 10వ స్థానంలో ఉంది. 


Updated Date - 2020-07-16T05:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising