ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత ఓటు ఆన్‌లైన్‌ డేటింగ్‌కే!

ABN, First Publish Date - 2020-12-23T05:59:04+05:30

ఈ ఏడాది ప్రేమకథలకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయింది. తమ కలల జంటను వెతుక్కొనేందుకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య పెరిగింది. చిన్నపట్టణాల్లో కూడా ఈ డేటింగ్‌ కల్చర్‌ విస్తరిస్తోందని క్వాక్‌క్వాక్‌ అనే డేటింగ్‌ యాప్‌ అధ్యయనం చెబుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది ప్రేమకథలకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయింది. తమ కలల జంటను వెతుక్కొనేందుకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య పెరిగింది. చిన్నపట్టణాల్లో కూడా ఈ డేటింగ్‌ కల్చర్‌ విస్తరిస్తోందని క్వాక్‌క్వాక్‌ అనే డేటింగ్‌ యాప్‌ అధ్యయనం చెబుతోంది. ఈ యాప్‌ లెక్కల ప్రకారంఈ ఏడాది ఖాతాదారులు 300 శాతం పెరిగారంటే అన్‌లైన్‌ డేటింగ్‌కు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది. డేటింగ్‌ ట్రెండ్‌లోని ఆసక్తికర విషయాలివి...

  • డేటింగ్‌ కల్చర్‌ ఇప్పటి వరకూ పెద్ద పట్టణాల్లోనే కనిపించేది. కానీ కరోనా భయాలతో ముఖాముఖిగా కలవడం కన్నా ఆన్‌లైన్‌లో డేటింగ్‌కు సై అంటున్నారంతా. తమ కొత్త యూజర్లలో 70శాతం మంది చిన్న పట్టణాలకు చెందిన వారేనని చెబుతోంది క్విక్‌క్వాక్‌ యాప్‌. 
  • తోడును వెతుక్కునేవారు తొందర పడడం లేదు. మంచి భాగస్వామిని ఎంచుకునేందుకు సమయాన్ని వెచ్చిచ్చిస్తున్నారు. ప్రొఫైల్‌ నచ్చితే చాలు గంటల కొద్దీ సందేశాలతో గడిపేస్తున్నారు. సగటున ఒక యూజర్‌ డేటింగ్‌ యాప్‌లో కనీసం 11 నిమిషాలు గడుపుతున్నారని వీరి పరిశీలనలో తేలింది. 
  • ప్రస్తుతానికైతే డేటింగ్‌ యాప్‌ యూజర్లలో ఎక్కువమంది సగటు వయసు 25 ఏళ్లే. గత ఏడాది ఈ సంఖ్య 29 ఏళ్లు ఉండేది. రానురాను ఎక్కువ మంది టీనేజర్స్‌ ఆన్‌లైన్‌ డేటింగ్‌లో చేరితే సగటు వయసు మరింత తగ్గే అవకాశముంది. 
  • లాక్‌డౌన్‌ సమయంలో మహిళా యూజర్లు 12 శాతం పెరిగారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా మహిళలు ఆన్‌డైన్‌ డేటింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు మహిళలు రోజుకు 48సార్లు డేటింగ్‌ యాప్‌ చూస్తుంటే, మగవాళ్లు 24 సార్లు మాత్రమే చూస్తన్నారట.
  • డేటింగ్‌ యాప్స్‌లో చాట్‌ చేసేవారి సంఖ్య రోజుకు మూడు లక్షల యాభైవేల నుంచి అయిదు లక్షలకు చేరింది. ఈసారి ప్రొఫైలో వ్యూస్‌ కూడా 25శాతం పెరిగాయి. డేటింగ్‌ యాప్స్‌లో తమకు జోడైన వారి గురించి వెతుకుతూ, నచ్చిన వారితో మాటలు కలుపుతున్నారు.
  • లాక్‌డౌన్‌ సమయంలో డేటింగ్‌లో ఉన్నవారిని వీడియో కాల్‌ దగ్గర చేసింది. డేటింగ్‌ యాప్స్‌లో వీడియో కాల్‌ ద్వారా సంభాషించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశముంది. క్విక్‌క్వాక్‌ యాప్‌ కూడా తమ యూజర్లకు వీడియో కాల్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చే ఆలోచనల్లో ఉంది. 

‘‘ఈ ఏడాది వర్చ్యువల్‌ డేటింగ్‌కే అందరూ ఓకే అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆన్‌లైన్‌ డేటింగ్‌కు ఓకే అంటున్నారు. చిన్న పట్టణాల నుంచి కూడా డేటింగ్‌ యాప్‌లో చేరిన వారున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొవిడ్‌ ముప్పు ఇంకా ఉన్నందున సామాజిక దూరం ఇంకొన్నాళ్లు తప్పేలా లేదు. దాంతో ఎక్కువమంది ఆన్‌లైన్‌ డేటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు’’ అంటున్నారు క్విక్‌క్వాక్‌ యాప్‌ రూపకర్త రవి మిట్టల్‌.

Updated Date - 2020-12-23T05:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising