ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ డిస్టెన్సింగ్‌ డ్రెస్‌

ABN, First Publish Date - 2020-12-02T05:54:29+05:30

కరోనా వచ్చిన తరువాత జనంలోకి బాగా వెళ్లిన మాట... ‘భౌతిక దూరం’ (సోషల్‌ డిస్టెన్స్‌). అంటే మనిషికి మనిషికి మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండేలా చూసుకోవాలనేది వైద్యుల సూచన. బయటకి వెళ్లినప్పుడు నిజంగా ఇది సాధ్యమవుతుందా? ఎంత వద్దనుకున్నా, మన ప్రమేయం లేకుండానే ‘ఆ దూరం’ తగ్గిపోతుంది. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు... దాదాపు అందరిది. జనమంతా రోడ్డెక్కుతున్న ఈ క్లిష్ట సమయంలో మరి దూరం పాటించడం ఎలా? దానికి అద్భుతమైన పరిష్కారం కనుగొంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ షే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వచ్చిన తరువాత జనంలోకి బాగా వెళ్లిన మాట... ‘భౌతిక దూరం’ (సోషల్‌ డిస్టెన్స్‌). అంటే మనిషికి మనిషికి మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండేలా చూసుకోవాలనేది వైద్యుల సూచన. బయటకి వెళ్లినప్పుడు నిజంగా ఇది సాధ్యమవుతుందా? ఎంత వద్దనుకున్నా, మన ప్రమేయం లేకుండానే ‘ఆ దూరం’ తగ్గిపోతుంది.  ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు... దాదాపు అందరిది. జనమంతా రోడ్డెక్కుతున్న ఈ క్లిష్ట సమయంలో మరి దూరం పాటించడం ఎలా? దానికి అద్భుతమైన పరిష్కారం కనుగొంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ షే.


స్వతహాగా డిజైనర్‌ అయిన ఈ యువతి ‘సోషల్‌ డిస్టెన్సింగ్‌ డ్రెస్‌’ను రూపొందించింది. దానికి ‘అకా’ అని పేరు కూడా పెట్టుకుంది. తానే ఆ డ్రెస్‌ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తే... వేలకు వేలు లైకులొచ్చాయి. ‘నీ సృజన అమోఘమం’టూ నెటిజనుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ డిజైనర్లు సైతం షే ప్రతిభ చూసి ‘వహ్వా’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ డ్రెస్‌ కోసం 300 గజాల వస్త్రం ఉపయోగించింది షే. తయారీకి రెండు నెలల సమయం పట్టింది. సెప్టెంబర్‌లో ఇలాంటి సూట్‌ ఒకటి రూపొందిస్తున్నానంటూ తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్‌ పెట్టింది. అప్పుడే అందరిలో ఆసక్తి పెరిగింది. డిజైనింగ్‌ నుంచి కుట్టు పని పూర్తయ్యే దాకా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అందిస్తూ ఉత్సుకత రేపింది. ఆఖరికి ఇదిగో ఇలా గులాబీ రంగు ‘సోషల్‌ డిస్టెన్సింగ్‌’ డ్రెస్‌ వేసుకుని వీడియో ఒకటి వదిలింది. అది మొదలు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుందీ వెరైటీ అవుట్‌ఫిట్‌. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే... ఆరు అడుగుల మేర చుట్టూ పరుచుకుంటుంది. చూడ్డానికి గౌనులా ఉండే ఈ వెరైటీ డ్రెస్‌ వేసుకొంటే... ఎవరైనా మీకు ఆరడుగుల దూరంలో ఆగిపోవాల్సిందే. ‘‘ఈ కరోనా కాలంలో ‘అకా’ డ్రెస్‌ మినీ బబుల్‌ లాంటిది. సోషల్‌ డిస్టెన్సింగ్‌ డ్రెస్‌ మొదలు పెట్టిన తరువాత అవసరానికి తగ్గట్టు డిజైన్‌ చేసుకొంటూపోయాను. చివరకు ఇదిగో ఇలా... ఊహించిన దాని కంటే ఎంతో బాగా వచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది షే. 

Updated Date - 2020-12-02T05:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising