ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంతోషాలు విరబూసేందుకు...

ABN, First Publish Date - 2020-12-09T05:30:00+05:30

ఏ బంధంలోనైనా చిన్నపాటి గొడవలు, అలకలు వస్తూపోతుండాలి. అప్పుడే ఆ బంధానికి అందం. మీ ప్రేమ ప్రయాణంలో సంతోషాలు విరబూయాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ బంధంలోనైనా చిన్నపాటి గొడవలు, అలకలు వస్తూపోతుండాలి. అప్పుడే ఆ బంధానికి అందం. మీ ప్రేమ ప్రయాణంలో సంతోషాలు విరబూయాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీ రొమాంటిక్‌ జర్నీలో ఎలాంటి అపార్థాలకు తావివ్వకూడదంటే ఏం చేయాలో చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు..  


  1. ఏం చెప్పినా వింటారనుకోవద్దు: మీ భాగస్వామి మీరు ఏం చెప్పినా వింటారనుకోవద్దు. మీ మాటే నెగ్గాలనే ధోరణి సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరు వారి నుంచి ఎంత ప్రేమ ఆశిస్తారో వారు కూడా మీ నుంచి అంతే ప్రేమను ఆశిస్తారనే విషయాన్ని మరచిపోవద్దు. తమను అర్థం చేసుకోవాలని, తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వాళ్లూ అనుకుంటారు. అందుకే వారి అభిరుచులను, అవసరాలను గుర్తించి మెలగాలి.
  2. గోప్యత పాటించాలి: మీ మధ్య ఉండే కొన్ని రహస్యాలను ఎవరి చెవిన పడనివ్వొద్దు. మీ వ్యక్తిగత విషయాలను మీ భాగస్వామి మూడో మనిషికి చెప్పొద్దని అనుకోవడంలో తప్పులేదు. అయితే మాటల సందర్భంలో లేదా గాసి్‌పగా గానీ పొరపాటున మీ ప్రియతమ మీ అంతర్గత విషయాలను ఇతరులతో పంచుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. దాంతో వారిమీద నమ్మకం పోతుంది. 
  3. ప్రాధాన్యం ఇవ్వకపోవడం: మీ భాగస్వామికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఆలోచించాలి. ఎందుకంటే మీరు తనకు అన్నివేళలా మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మీ ప్రియతమ కోరకుంటారు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిదే, అలాగనీ మీ తోడును నిర్లక్ష్యం చేయడం సరికాదు.
  4. తరచూ అపార్థం చేసుకోడం: ఒకరికొకరు తమ అభిప్రాయాలను పంచుకోవడం మీ బంధాన్ని బలపరుస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇదర్దరూ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల అవతలి వారు ఏం అనుకుంటున్నారో తెలుస్తుంది. దాంతో అపార్థాలకు అవకాశం ఉండదు. 
  5. మీ బంధాన్ని ప్రశ్నించడం: ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పటికీ పదేపదే అవతలి వారిని ప్రశ్నిస్తూ ఉండడం చేటు చేస్తుంది. మీ భాగస్వామి మీ ఇష్టాలను కాదని తమకు నచ్చినంట్టు ఉండేందుకు ప్రయత్నిస్తున్నారా! అని ఆలోచించడం వంటివి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. ఒక బంధం నిలబడాలంటే భద్రత, రక్షణ భరోసా ఉండాలి. అంతేతప్ప అనుమానం, అభద్రత కాదు.

Updated Date - 2020-12-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising