ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెనుక నిలిచి నడిపిస్తున్నది మహిళలే!

ABN, First Publish Date - 2020-12-16T06:25:06+05:30

‘‘లక్షలాది రైతులతో ఢిల్లీ సరిహద్దులు కుంభమేళాను తలపిస్తున్నాయి. భారత దేశ చరిత్రలోనే ఇదొక కనీవినీఎరుగని రైతాంగ పోరాటం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో...

దేశ రాజధానిలో ఉద్ధృతంగా సాగుతున్న రైతు ఉద్యమంలో తనదైన కీలక పాత్ర పోషిస్తున్నారు 

కవిత కురుగంటి. మూడు దశాబ్దాలుగా రైతు పోరాటాలతో మమేకమైన సామాజిక కార్యకర్త 

ఆమె.  కనీస మద్దతు ధర విధానంపై నియమితమైన రమేశ్‌ చంద్‌ కమిటీలోనూ సభ్యురాలు. 

అన్నదాతకు అన్యాయం జరిగే ప్రతిసందర్భంలోనూ పాలకులను నిలదీసే గొంతుక. 

42మంది రైతు నాయకులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న ఏకైక తెలుగు మహిళ 

అయిన కవిత నానాటికీ తీవ్రమవుతున్న రైతు పోరాట విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు.


నేనడిగిన ప్రశ్న...

ఢిల్లీ దిగ్బంధంలో సుమారు 550 రైతు సంఘాలు పాల్గొన్నట్లు ఒక అంచనా. అవన్నీ వివిధ సమన్వయ కమిటీలుగా ఏర్పడ్డాయి. వాటి ప్రతినిధులుగా 42మంది రైతు నాయకులు ప్రభుత్వంతో చర్చలకు హాజరయ్యారు. వారిలో మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌ ప్రతినిధిగా నేనూ ఉన్నాను. ఇప్పటివరకు ఆరుసార్లు చర్చలు సాగాయి. ఇవన్నీ చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయి. సమావేశంలో కేంద్రమంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు చెప్పే విషయాలను మేమంతా చాలా జాగ్రత్తగా వింటున్నాం. వాళ్లూ అంతే గౌరవంగా మా మాటలను ఆలకిస్తున్నారు. ‘‘మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి మేలు కలుగుతుందని మీరేమైనా రుజువు చూపగలరా?’’ అని వ్యవసాయ శాఖ మంత్రిని అడిగాను. అందుకు ఆయన చెప్పిన సమాధానం...‘‘మాకూ కొన్ని కంపల్షన్స్‌ (మజ్‌బూరి) ఉంటాయి’’ అని. ‘‘వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం. ఇలాంటి వ్యవసాయ చట్టాలు చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందా?’’ అని ప్రశ్నించాను. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌, ఐటెమ్‌ నెంబర్‌ 33 ప్రకారం తమకు అధికారం ఉందని బదులిచ్చారు.


‘‘రాష్ర్టాల జాబితా-2 ప్రకారం వ్యవసాయ మార్కెట్‌ అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం’’ అని అడిగితే... సమాధానం లేదు. ‘‘అంతిమంగా చట్టాల రద్దు ఒక్కటే మా ప్రధాన డిమాండ్‌’’ అని స్పష్టం చేశాం. అందుకు వాళ్లు సుముఖత చూపలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూడు సాగు వ్యతిరేక చట్టాలు దేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం కోసమే. ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్‌ యార్డ్‌ వ్యవస్థలో చాలా లోపాలున్నాయి. అయితే, దీనికి కార్పొరేటీకరణ ప్రత్యామ్నాయం కాదంటున్నాం. 


‘‘లక్షలాది రైతులతో ఢిల్లీ సరిహద్దులు కుంభమేళాను తలపిస్తున్నాయి. భారత దేశ చరిత్రలోనే ఇదొక కనీవినీఎరుగని రైతాంగ పోరాటం. రోజురోజుకు ఉద్యమ క్షేత్రం జన ప్రవాహంగా మారుతోంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్న ప్రతి  రైతు ముఖంలో ‘అనుకున్నది సాధించి తీరుతామ’నే దృఢ విశ్వాసం కనిపిస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించాకే ఇంటికి తిరుగు ప్రయాణమవుతామని ప్రతినపూని వచ్చిన వాళ్లూ చాలామందే ఉన్నారు. నిజానికి పంజాబ్‌, యూపీ, హర్యానా రైతులకు ఇది గోధుమ నాటే సమయం. మరి ‘మీ పంట పొలం’ సంగతేమిటని నిరసనలో పాల్గొన్న ఒక రైతును అడిగాను. అతను వెంటనే తన ఊర్లోని మరొక రైతుకు ఫోన్‌చేసి, నాకు ఇచ్చాడు. ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ ‘‘ఏమైనాగానీ విజయంతో తిరిగిరా. అప్పటి వరకూ నీ పొలం బాధ్యత నాది’’ అని తన స్నేహితుడికి వాగ్దానం చేసినట్టు చెప్పారు.


ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా ఊరికి వెళ్ళాలన్నా... ఊరు నుంచి ఐదుగురు వచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి ఒకరు ప్రయాణమవుతున్నారు. ఒక రైతు తన తోబుట్టువు పెళ్లికి కూడా వెళ్లలేదు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. వారి పోరాటం ఎంత బలమైనదో చెప్పాడానికి ఇవన్నీ తార్కాణాలు.  రైతులను వేర్పాటువాదులు, తీవ్రవాదులు, అతివాదులు... అంటూ ఇష్టానుసారంగా కొద్దిమంది కృత్రిమ మేధావులు మాట్లాడుతున్నారు. నిజానికి కేంద్రం మూడు సాగు బిల్లులను ఆర్డినెన్స్‌గా తెచ్చినప్పుడే, పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. చట్టాల్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాక... అవి రైతు వ్యతిరేక విధానాలని వారంతా నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాతే నిరసనలు మొదలుపెట్టారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలో పంటల ప్రభుత్వ సేకరణ, మండీ వ్యవస్థలు బలంగా ఉన్నాయి. కనునే చట్టాలతో తలెత్తే నష్టాలను ముందే వారంతా గుర్తించగలిగారు.


ఇది శుభపరిణామం

రెండు రోజుల కిందట తేనె ఉత్పత్తిదారులు పెద్ద లారీలో వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ రెండేసి సీసాల తేనె  ఇచ్చి వెళ్ళారు. చుట్టుపక్క ప్రాంతాల రైతులు రోజూ చెరుకు రసం పంచుతున్నారు. చాలామంది వైద్యులు ఎక్కడిక్కడ టేబుల్‌ వేసుకొని, నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నారు. సబ్బులు, షాంపూలు, టూత్‌బ్రెష్‌లు, దుప్పట్లు తదితర నిత్యావసర వస్తువులనూ అందరికీ అందుబాటులో ఉంచారు. అవన్నీ పూర్తి ఉచితమే! ప్రతిచోటా లంగరీలు (ఆహార శాలలు) ఏర్పాటు చేశారు.


వాటిలో సర్దార్జీలు వండి వడ్డిస్తున్నారు. యువజనులు పెద్ద ఎత్తున ఉద్యమ క్షేత్రానికి తరలిరావడం స్ఫూర్తిదాయకం. నిరసనలో మహిళల సంఖ్య పదిహేను శాతం మించి లేదనే చెప్పాలి. అందులోనూ యాభై ఏళ్లు దాటిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే, మహిళలు పొలం, ఇంటి బాధ్యతలు పూర్తిగా తీసుకోబట్టే మగవాళ్లు నిరసనలో పాల్గొనగలుగుతున్నారు. అలా చూసినప్పుడు, రైతు ఉద్యమానికి మహిళాలోకమే వెనక ఉండి నడిపిస్తోందని చెప్పచ్చు. ఢిల్లీలోని పంజాబీ కమ్యూనిటీకి చెందిన చాలామంది తల్లితండ్రులు వారాంతాల్లో తమ పిల్లలను తీసుకొచ్చి, రైతులతో మాట్లాడిస్తున్నారు. రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా నగరవాసులు అన్నదాతకు మద్దతుగా నిలవడం మంచి పరిణామం.


ఒకే మాటగా...

ఇన్నాళ్లు చీలికలు పీలికలుగా మిగిలిన రైతు సంఘాలన్నీ ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఒకే లక్ష్యంతో ముందుకెళుతున్నాయి. ఆ క్రమంలో సమష్టి దృక్పథానికి ప్రాధాన్యం ఇస్తూ, నిర్ణయాలు తీసుకుంటున్నాం. అయితే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. రైతుల డిమాండ్‌ను అంగీకరించకపోవడానికీ ప్రభుత్వం వద్ద సరైన కారణం లేదు. వాళ్లు దీన్ని ‘ప్రతిష్టకు సంబంధించిన అంశం (ప్రిస్టేజ్‌ ఇష్యూ)’గా తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. అతి కొద్దిమంది మినహా... ఎన్‌ఆర్‌ఐలు, మిగతా పౌర సమాజం రైతుల పక్షాన నిలిచారు. అవినీతికి తావులేని రంగం ఒక్క వ్యవసాయ రంగమేనని మన సమాజం నమ్ముతుంది.


అందరిలోనూ రైతు పట్ల అమితమైన గౌరవభావం ఉంది. అదే రైతుల పోరాటానికి అతి గొప్ప ఇంధనం. మరో నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రైతులు పెద్ద సంఖ్యలో ఆగ్రా సరిహద్దుకు చేరుకోనున్నట్లు సమాచారం. రైతులంతా, చాలా ప్రశాంతంగా, ఎలాంటి ఉద్రేకాలకు తావులేకుండా ఉద్యమాన్ని మున్ముందుకు తీసుకెళుతున్నారు. సాగు చట్టాల రద్దు మినహా మరే సవరణలకూ అంగీకరించడంలేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.


ఒంటరి మహిళలకు చేటు...

కొన్ని లక్షల మంది ఒంటరి మహిళలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అసలు మన మార్కెట్‌ వ్యవస్థ మహిళా రైతులకు అనుకూలంగా ఉండదు. వారు నేరుగా వెళ్లి ఉత్పత్తులను అమ్ముకోవడం అంత సులువు కాదు. ‘రైతులవద్దకే వ్యాపారులు నేరుగా వెళ్లి పంట కొనుగోలు చేసుకోవచ్చు’ అని రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం చెబుతోంది. ఇదివరకు కూడా అలాంటి పద్ధతిలో కొనుగోళ్లు జరుగుతుండేవి కూడా. కానీ కొత్త చట్టం ప్రకారం వ్యాపారులపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా ఉండదు. జవాబుదారీతనం ఉండదు. కనుక లాభాపేక్ష కలిగిన వ్యాపారి రైతును మరింత దోచుకునేందుకే చూస్తాడు. అందుకు చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. స్వేచ్ఛా విపణి వల్ల రైతులు, మరీ ముఖ్యంగా మహిళా రైతులు మరింత దోపిడీకి లోనవుతారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం నడుస్తున్న కనీస మద్దతు ధర విధానంలోని లోపాలను సరిచేయడంతో పాటు, రైతు సంక్షేమం ప్రాదిపదికన కనీస మద్దతు ధర పద్ధతి ఎలా ఉండాలనే విషయంపై సిఫార్సుల కోసం 2013లో యూపీఏ ప్రభుత్వం రమేశ్‌ చంద్‌ కమిటీని ఏర్పాటుచేసింది.


ఆ కమిటీలో నేనూ సభ్యురాలిగా ఉన్నా. 2015లో మా నివేదికనూ మోదీ ప్రభుత్వానికి సమర్పించాం. ఆ మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పాలు, కూరగాయలు, అటవీ ఉత్పత్తులు తదితర వస్తువులపై రైతుల పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి కనీస మద్దతు ధరగా ప్రకటిస్తూ, చట్టం చేయాలని రైతు సంఘాలన్నీ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నాయి. ఇప్పుడూ మా రెండో ప్రధాన డిమాండ్‌ అదే!’’ 

 కె. వెంకటేశ్‌

Updated Date - 2020-12-16T06:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising