ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డియోడరంట్‌... ఉపయోగాలెన్నో..

ABN, First Publish Date - 2020-06-17T05:32:01+05:30

పర్‌ఫ్యూమ్‌.... చెమట వాసన రానివ్వదు. అంతేనా రోజంతా తాజాదనాన్ని అందించే పర్‌ఫ్యూమ్‌తో అనేక ఉపయోగాలున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్‌ఫ్యూమ్‌.... చెమట వాసన రానివ్వదు. అంతేనా రోజంతా తాజాదనాన్ని అందించే పర్‌ఫ్యూమ్‌తో అనేక ఉపయోగాలున్నాయి. 


  1. పాదాల కింద కొందరికి తరచుగా చెమట పట్టి చెడు వాసన వస్తుంది. అలా జరగకుండా ఏం చేయాలంటే కొద్దిగా ఫర్‌ఫ్యూమ్‌ను పాదాల కింద స్ర్పే చేయాలి. దాంతో చెమట పట్టడం తగ్గుతుంది. ఒకవేళ పట్టినా చెడు వాసన రాదు. 
  2. కొందరికి ముక్కు దగ్గర చెమట పడుతుంది. ముఖ్యంగా మేకప్‌ వేసుకునే సమయంలో చెమట ఎక్కువవుతుంది. వేసవిలో ఈ సమస్య మరీ ఎక్కువవుతుంది. అలాంటప్పుడు ముక్కు పుటల వెంబడి కొద్దిగా పర్‌ఫ్యూమ్‌ రాస్తే ఫలితం ఉంటుంది.
  3. కొత్త షూ లోపలి భాగం గరుకుగా ఉంటుంది. వాటిని వేసుకున్నప్పుడు కాలివేళ్లు నొప్పి పుట్టడంతో నడవడం కష్టంగా అనిపిస్తుంది. షూ లోపల డియోడరంట్‌ స్ర్పే చేస్తే షూ గరుకుదనం తగ్గి సౌకర్యంగా ఉంటుంది.
  4. వేసవిలో దోమలు, ఇతర పురుగులు కుడుతుంటాయి. దోమలు కుట్టిన  చోట చర్మం ఎర్రగా మారి దురద పెడుతుంది. ఆ భాగంలో కొద్దిగా పర్‌ఫ్యూమ్‌ను స్ర్పే చేస్తే దురద మాయం అవుతుంది.
  5. ఎండకు చెమట పట్టినప్పుడు మెడ వెనక భాగానికి వెంట్రుకలు అతుక్కుపోతాయి. అలా జరగకుండా మెడ వెనుక డియోడరంట్‌ చల్లుకుంటే సరి.

Updated Date - 2020-06-17T05:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising