ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు పెంచుతున్నారా?

ABN, First Publish Date - 2020-08-03T07:42:05+05:30

వర్షాకాలంలో ఇంటి గార్డెన్‌ నిర్వహణ కష్టంగా అనిపిస్తుంది. కారణం వాననీళ్లు మొక్కల కుండీల్లో నిలిచిపోవడం, రకరకాల ఇన్‌ఫెక్షన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాకాలంలో ఇంటి గార్డెన్‌ నిర్వహణ కష్టంగా అనిపిస్తుంది. కారణం వాననీళ్లు మొక్కల కుండీల్లో నిలిచిపోవడం, రకరకాల ఇన్‌ఫెక్షన్లు వంటివి ఆందోళన పెంచుతాయి. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే మొక్కల పెంపకం అంత కష్టమేమి కాదు.


అవేమిటంటే...

  1. మొక్కల కుండీలను వాననీళ్లు పడే చోట ఉంచకూడదు. వాన నీళ్లు నిలవడం వల్ల దోమలు, ఇతర కీటకాల బెడద ఎక్కువయ్యే అవకాశముంది. అందుచేత సూర్యరశ్మి పడే చోట కుండీలను పెట్టండి. మొక్కలకు సరిపోనూ నీళ్లు పోయండి
  2. ఒక్కోసారి కుండీలోని పైమట్టి తెట్టులా మరి నీళ్లు కిందకు తొందరగా ఇంకవు. అలాంటప్పుడు చిన్న కర్రముక్క తీసుకొని పై మట్టి, కింది మట్టిని మిక్స్‌ చేసినట్టు కలపండి. దాంతో మట్టి మధ్య ఖాళీ ఏర్పడి నీరు వేళ్ల భాగానికి తొందరగా చేరుతుంది. 
  3. అలానే మొక్కల ఆకులు, పువ్వుల మీద ఆహారం కోసం పురుగులు, కీటకాలు చేరుతున్నాయేమో గమనించండి. కీటకాలు ఏమైనా కనిపిస్తే వాటిని వెంటనే తొలగించండి.
  4. ఈ సీజన్‌లో వేసవిలో మాదిరి తరచూ మొక్కలకు నీళ్లు పోయకూడదు. మొక్క ఎక్కువ నీళ్లు పీల్చుకుంటే వాడిపోయే అవకాశముంది. కాబట్టి కుండీలోని మట్టి పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీళ్లు పోయండి. 
  5. చిన్న మొక్కలు, తీగజాతి మొక్కలు గాలులు, వర్షానికి తొందరగా దెబ్బతింటాయు. అందుకే వాటి విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

Updated Date - 2020-08-03T07:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising