ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 నిమిషాల్లో టొమాటో రైస్‌!

ABN, First Publish Date - 2020-04-02T06:03:03+05:30

కొంచెం రైస్‌, మూడు టొమాటోలు, కొన్ని పోపు గింజలు, ఒక వంట పాత్ర ఉంటే చాలు.. 20 నిమిషాల్లో ఇట్టే రుచికరమైన టొమాటో రైస్‌ను చేసుకోని తినొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంచెం రైస్‌, మూడు టొమాటోలు, కొన్ని పోపు గింజలు, ఒక వంట పాత్ర ఉంటే చాలు.. 20 నిమిషాల్లో ఇట్టే రుచికరమైన టొమాటో రైస్‌ను చేసుకోని తినొచ్చు. 

 

కావలసిన  పదార్థాలు 

రైస్‌ - 1 1/2 కప్పు, టొమాటోలు - 3, నూనె/నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - 1, కూరమిరప - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - కొంచెం, ఉప్పు, పసుపు, కారం - తగినంత 


తయారుచేసే విధానం

ముందుగా రైస్‌ను బాగా కడిగి వండి ఉంచుకోవాలి. స్టవ్‌ మీద పాత్రను పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేగాక తరిగిపెట్టుకున్న కరివేపాకు, ఉల్లి, పచ్చిమిరప ముక్కలు వేసుకోవాలి. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలుపుకొని సువాసన వచ్చేదాక వేగించాలి. టొమాటో ముక్కలు, పసుపు వేసి మూతపెట్టి, టొమాటో ముక్కలు మొత్తగా అయ్యేదాకా ఉడికించాలి. దానికి తగినంత కారం, ఉప్పు, పసుపు వేసి, అన్నం కలిపి మూతపెట్టి సన్నమంట మీద నీళ్లు ఇగిరిపోయేదాకా ఉంచాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని, నిమ్మరసం కలిపితే వేడివేడి టొమాటో రైస్‌ రెడీ.

Updated Date - 2020-04-02T06:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising