ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లు పెద్దవిగా కనిపించేందుకు!

ABN, First Publish Date - 2020-12-18T05:30:00+05:30

కళ్లు మాట్లాడతాయి. కనికట్టు చేస్తాయని తెలుసు. అయితే కళ్లు పెద్దవిగా కనిపిస్తే ఆ అందమే వేరు. కళ్లు మాత్రమే ఫోకస్‌ అయ్యేలా మేకప్‌ చేసుకుంటే కళ్లను పెద్దగా కనిపించేలా చేయొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ళ్లు మాట్లాడతాయి. కనికట్టు చేస్తాయని తెలుసు. అయితే కళ్లు పెద్దవిగా కనిపిస్తే ఆ అందమే వేరు. కళ్లు మాత్రమే ఫోకస్‌ అయ్యేలా మేకప్‌ చేసుకుంటే కళ్లను పెద్దగా కనిపించేలా చేయొచ్చు.  అదెలాగంటే...

 

 కనుబొమలను ఐ బ్రో పెన్సిల్‌తో చక్కగా సింగారించుకుంటే కనులు పెద్దవిగా కనిపిస్తాయి. కనుబొమలకు అవసరమైతే పెట్రోలియం జెల్లీ కూడా రాసుకోవచ్చు. చివరగా కన్‌సీలర్‌ ఉపయోగిస్తే కనుబొమలు ఆకర్షణీయంగా మారి కళ్లు పెద్దవిగా కనిపిస్తాయి.  


 హైలైటర్‌ ఉపయోగిస్తే పెద్దవిగా కనిపిస్తాయి. కన్‌సీలర్‌ తరువాత మెరుస్తూ ఉండే హైలైటర్‌ను కొద్దిగా కళ్ల కింద రాసుకోవాలి. ఇలాచేస్తే కళ్లు హైలైట్‌ అవుతాయి. పెద్దవిగా, మెరుస్తూ కనిపిస్తాయి.

 

 కళ్ల చుట్టూ ఐ లైనర్‌ రాసుకోవాలి. కింది కనురెప్పలను మాత్రం అలాగే వదిలేయాలి. కళ్ల లోపలి అంచుల వెంబడి వైట్‌ ఐ లైనర్‌ రాసుకున్నా కూడా కనులు ఆకట్టుకునేలా మారతాయి. 


 కనురెప్పలను ఐ లాష్‌ కర్లర్‌తో వాటిని ఒకవైపు తిప్పాలి. తరువాత కాటుక కొంచెం ఎక్కువ రుద్దుకుంటే కళ్లు పెద్దగా కనిపిస్తాయి. 

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising