ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్గానికి దారి సత్యమే

ABN, First Publish Date - 2020-06-05T05:30:00+05:30

ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనించి చూస్తే- అసత్యం చెడ్డదని ఈ రోజుల్లో ఎవరూ అనుకోవడం లేదు. అది చెడ్డ పనుల జాబితా నుంచి మినహాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనించి చూస్తే- అసత్యం చెడ్డదని ఈ రోజుల్లో ఎవరూ అనుకోవడం లేదు. అది చెడ్డ పనుల జాబితా నుంచి మినహాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందింది. 


మానవుడు తన నిత్య జీవితంలో అసత్యానికి తావు లేకుండా, సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. సంకల్పం ఉంటే అదేమీ అసాధ్యం కాదు. కానీ, లోకంలో చాలామంది సత్యం గురించి పట్టించుకోరు. తమకు సంబంధించినంతవరకూ ఇతరులు అబద్ధాలు చెప్పకూడదనీ, తమ విషయంలో వాళ్ళు నిక్కచ్చిగా ఉండాలనీ కోరుకుంటూ ఉంటారు. కానీ ఇతరుల విషయంలో తాము ఎలా వ్యవహరిస్తున్నామనే ఆత్మపరిశీలన చేసుకోరు. 

‘‘సత్యం ఒక మహత్తరమైన సుగుణం. సత్యం మానవులకు మంచి వైపు మార్గం చూపిస్తుంది. మంచివారిని స్వర్గం వైపు తీసుకువెళుతుంది. అసత్యం మనుషులను చెడు వైపు నడిపిస్తుంది. నరకానికి తీసుకుపోతుంది’’ అని హెచ్చరికతోకూడిన సందేశాన్ని దైవ ప్రవక్త మహమ్మద్‌ మానవులకు అందించారు. సత్యానికి ఇంతటి మహత్తూ, ప్రాధాన్యం ఉన్నాయని అందరికీ తెలుసు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలాడేవాళ్ళు కూడా సత్యానికి మించిన సంపద లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం తప్పు చేస్తూ ఉంటారు. అసత్యాన్నే ఆశ్రయిస్తారు. 

సమాజంలో చాలామంది తమ పబ్బం గడుపుకోవడానికీ, తమకు ప్రయోజనాన్నీ, లాభాల్నీ చేకూర్చి పెట్టే సాధనంగా అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు. స్వార్థం, స్వలాభాల కోసం ఎంత పెద్ద అబద్ధం చెప్పడానికైనా సంశయించడం లేదు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదనీ, సత్యం మాట్లాడిన కారణంగా సర్వస్వం కోల్పోయే పరిస్థితి వచ్చినా సరే, అసత్యాన్ని ఆశ్రయించవద్దనీ దైవ ప్రవక్త మహమ్మద్‌ హితవు పలికారు. అంతేకాదు, ‘‘ఇంట్లో పిల్లలకు ఏదైనా తెస్తాననీ, ఇస్తాననీ ఆశ చూపించి... ఆ తరువాత ఇవ్వకపోవడం కూడా తప్పే: అది కూడా అసత్యమే అవుతుది. దైవం ముందు దానికి సమాధానం చెప్పుకోవాల్సిఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఏ కారణం వల్లనో అసత్యం చెబితే దానికి చింతించి, పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ వేడాలనీ సూచించారు. కాబట్టి, మానవులు సాధ్యమైనంతవరకూ సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలకడానికీ, అబద్ధాలకు దూరంగా ఉండాలి. అబద్ధాల కోరును ప్రజలు ఎన్నటికీ విశ్వసించరు. ప్రేమించరు. గౌరవించరు. ఇది సత్యం. అందుకని, సదా సత్యమే పలికే సద్బుద్ధిని అందరికీ ప్రసాదించాలని అల్లాహ్‌ను కోరుకోవాలి.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-06-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising