ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనిషిని నేను

ABN, First Publish Date - 2020-09-30T06:23:01+05:30

రికార్డింగ్‌ థియేటర్లలో వేల పాటలు పాడిన బాలు... ఓ దినపత్రికలో వచ్చిన కవితకు ఫిదా అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన తంగెళ్ల రాజగోపాల్‌ రాసిన ‘మనిషిని నేను’ అనే ఆ కవితను పాడుతూ... తన సెల్‌ఫోన్‌లోనే రికార్డు చేసుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రికార్డింగ్‌ థియేటర్లలో వేల పాటలు పాడిన బాలు... ఓ దినపత్రికలో వచ్చిన కవితకు ఫిదా అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన తంగెళ్ల రాజగోపాల్‌ రాసిన ‘మనిషిని నేను’ అనే ఆ కవితను పాడుతూ... తన సెల్‌ఫోన్‌లోనే రికార్డు చేసుకున్నారు. యూట్యూబ్‌లో ఇప్పుడిది ట్రెండింగ్‌ అవుతోంది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ అప్‌లోడ్‌ చేసిన ఈ పాటను ఇప్పటికి 12 లక్షలమందికి పైగా వీక్షించారు.

బాలు ఆలపించిన ఆ కవిత మీ కోసం... 


విశ్వం నా కోసమే విస్తరించి ఉందని 

పుడమి నా కోసమే పుట్టిందని  

సమస్త జీవరాశులు నా బానిసలని  

నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను... మనిషిని నేను  


అవనిని అమ్మంటాను నేను 

ఆదిత్యుణ్ని నాన్నంటాను నేను  

నడక వచ్చేదాకే అణిగిమణిగి ఉంటాను 

నేను ఎగిరితే మేఘం అడ్డురాకూడదన్నాను 


అడుగేస్తే అడవి దారి విడాలన్నాను 

పడవెక్కితే అలలు తలొంచాలన్నాను 

అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను 

సాగర గర్భంలో చమురుందని చిలికేశాను  

మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను  


నేలమీద గీతలు గీసి నీది నాదని పంచేసుకున్నాను  

నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను  

నేనే రాజునన్నాను 

తక్కినదంతా నా రాజ్యమన్నాను

నా కొట్లాటలు చరిత్రన్నాను

రుజువు కోసం రాళ్లు పాతాను 

నేను చెప్పినట్టు నడిచే 

నేను చెక్కినట్టు కనిపించే 

నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నాను

నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను 

ఏడంటే అడిగోనని చేతులు పైకెత్తాను 

దాన్ని దీన్ని చంపుకుతిన్నాను 

వింతరోగమంటించుకుని ఊరంతా ఏగాను 

గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను... గుమ్మం దాటనన్నాను 

నే స్వాగతం పాడకపోతే వసంతమాగి పోయిందా 

నా స్వాగతం వినపడకపోతే ఆమని పాట ఆపిందా 

నే చతికిలపడగానే భూభ్రమణం నిలిచిందా 

నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా 


రాజు కాదు బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను 

బతికుంటే చాలంటూ గోల గోల పెట్టాను

నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను

బుద్ధేదో వచ్చినట్టు వినయమొలకబోశాను 

మందో మాకో దొరకంగానే మళ్లీ గద్దెనెక్కుతాను 

ఒళ్లు చక్కబడంగానే నువ్వెంతని అంటాను 

నాకేదీ సాటిరాదంటూ మళ్లీ మొదటికొస్తాను 


మనిషిని నేను మాయదారి మనిషిని నేను 

మనిషిని నేను మాయదారి మనిషిని నేను

 


ఏ తాళంలో పాడాలని అనుకోలేదు. ఈ రాగంలో పాడాలని అనుకోలేదు. మాటలు ఎక్కడ విరుగుతాయోనని అనుకోలేదు. ఎక్కడ కామా పెట్టాలో... ఎక్కడ ఫుల్‌స్టాప్‌ పెట్టాలో తెలియలేదు. కవిత చదవగానే ఎందుకో పాడాలనిపించింది... పాడేశాను. 


Updated Date - 2020-09-30T06:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising