ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరికొకరు తోడైతేనే మనుగడ!

ABN, First Publish Date - 2020-11-13T05:30:00+05:30

ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం మరిచిపోకూడదు. ‘ఉన్నత స్థితిలో ఉన్నాం కదా!’ అని బండి గురించి మరిచిపోకూడదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం మరిచిపోకూడదు. ‘ఉన్నత స్థితిలో ఉన్నాం కదా!’ అని బండి గురించి మరిచిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నా ఇతరుల సహాయం అవసరమవుతుంది. ఈ విషయం గురించి మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం. 


  • అక్కరపాటువచ్చు సమయంబున జుట్టములొక్క రొక్కరి
  • న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమే సుమీ
  • యొక్కట, నీటిలో మెరక నోడల బండ్లును, బండ్లనోడలున్‌
  • దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా




అవసరమైన సమయంలో, ఆపద ఏర్పడిన సమయంలో బంధువులకు, మిత్రులకు తోచిన సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వాళ్లు కూడా మొహమాటం లేకుండా అడగాలి. నీటిలో ఓడ గొప్పది, భూమి మీద బండి గొప్పది. ఎంత గొప్ప ఓడైనా నేల మీద నడవలేదు. అలాగే ఎంత గొప్ప బండైనా నీళ్లలో వెళ్లలేదు. అందుకే ఓడలో వేయాల్సిన సరుకును బండి సహాయంతో ఓడ దగ్గరకు తీసుకొస్తారు. రేవు దాటించాల్సిన సరుకును ఓడ సహాయంతో దాటిస్తారు. మళ్లీ ఓడలో నుంచి దింపాక బండిలోనే ఊర్లోకి చేరుస్తారు. అలా ఒండికి ఓడ సహాయం, ఓడకు బండి సహాయం అవసరం. ఓడ దెబ్బతింటే బండిలోనే తీసుకెళ్లి మరమ్మతులు చేయించి తీసుకొస్తారు. 

బండి పాడైతే నదికి ఆవలి తీరంలో ఉన్న మెకానిక్‌ దగ్గరకు ఓడలోనే తీసుకెళతారు. ఆపద వచ్చినపుడు బండికి ఓడ, ఓడకు బండి. అలాగే అందరూ పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండాలి. బంధువులు, మిత్రులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి. 


- గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-11-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising