ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరికొత్తగా టక్సన్‌

ABN, First Publish Date - 2020-07-15T05:30:00+05:30

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండాయ్‌ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్స్‌తో బిజీగా ఉంది. ఆ కోవలోనే తాజాగా తమ ‘టక్సన్‌’కు మరిన్ని హంగులద్ది ఫేస్‌లిఫ్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండాయ్‌ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్స్‌తో బిజీగా ఉంది. ఆ కోవలోనే తాజాగా తమ ‘టక్సన్‌’కు మరిన్ని హంగులద్ది ఫేస్‌లిఫ్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ‘వెర్నా, క్రెటా, ఔరా’లకు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లను తెచ్చింది హ్యుండాయ్‌.  


విశేషాలెన్నో... 

  1. ‘టక్సన్‌’తో పోలిస్తే ఈ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ ఎక్స్‌టీరియర్స్‌ కాస్త భిన్నంగా ఉంటాయి. 
  2. షార్ప్‌ కాస్కేడింగ్‌ గ్రిల్‌, ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, షార్పర్‌ బంపర్స్‌, డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌, టెయిల్‌ ల్యాంప్స్‌ వంటి వాటితో నయా లుక్‌ సంతరించుకుంది.  
  3. ఇంటీరియర్స్‌లో చూడగానే ఆకట్టుకొనేది టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌. 8 అంగుళాల డిస్‌ప్లేతో పాటు ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌కార్‌ ప్లే, కీలెస్‌ ఎంట్రీ తదితర ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. 
  4. వైర్‌లెస్‌ ఫోన్‌ చార్జర్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, పవర్డ్‌ ఫ్రంట్‌ సీట్స్‌ మరో ప్రత్యేకత. ఈ సీట్లను ఎనిమిది రకాలుగా మార్చుకోవచ్చు. 
  5. భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ర్టిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ వంటివి అమర్చారు. 
  6. బీఎస్‌-6 ఇంజిన్‌. 2.0 లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ వెర్షన్లు ఉన్నాయి. 


‘టక్సన్‌’ ఫేస్‌లిఫ్ట్‌ 

ప్రత్యేకతలు: పెట్రోలు, డీజిల్‌ వెర్షన్లలో లభిస్తోంది. 6-స్పీడ్‌ (పెట్రోలు) 8-స్పీడ్‌ (డీజిల్‌ ) ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌.  

ధర: రూ.18.76 లక్షల నుంచి 26.97 లక్షలు


Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising