ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలను హింసిస్తే... హెచ్చరికలు చేయరా?

ABN, First Publish Date - 2020-02-23T06:14:33+05:30

‘ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం’ - నటీనటులు ఎవరైనా సిగరెట్‌ కాల్చే, మందు తాగే సన్నివేశాలు వస్తే వెండితెరపై కనిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం’ - నటీనటులు ఎవరైనా సిగరెట్‌ కాల్చే, మందు తాగే సన్నివేశాలు వస్తే వెండితెరపై కనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో అదే మాట చెబుతారు! ప్రేక్షకులకు అదొక హెచ్చరిక!! నిజజీవితంలో ఎవరూ ధూమపానం, మధ్యపానాని ఆకర్షితులు కాకూడదని హెచ్చరిస్తారు. ‘ఈ చిత్రనిర్మాణంలో పక్షులకు గానీ, జంతువులకు గానీ ఎటువంటి హాని చేయలేదు’ - ఒకవేళ చిత్రంలో జంతువులతో తీసిన సన్నివేశాలుంటే ఈ మాట వస్తుంది. మరి, గృహహింస నేపథ్యంలో సన్నివేశాలున్న చిత్రంలో అటువంటి హెచ్చరికలు ఉంటాయా? ఉండవు! ఈ విషయంలో మార్పు తీసుకురావాలని తాప్సీ అభిప్రాయపడ్డారు.


‘‘ధూమపానం, మధ్యపానం, జంతుహింస కంటే మహిళపై చేయి చేసుకోవడం, చెంపదెబ్బలు కొట్టడం, గృహహింస చిన్న విషయమా? కాదు! సిగరెట్‌, మందుతో పాటు గృహహింసపైనా హెచ్చరిక రావడం అవసరం. ఆ మార్పు కోసం మీరూ పిటిషన్‌ మీద సంతకం చేయండి. మద్దతు ఇవ్వండి. మహిళలపై చేయి చేసుకోవడం, గృహ హింసకు వ్యతిరేకంగా హెచ్చరిక రావాలని సెన్సార్‌ బోర్డును కోరుతూ ‘ఛేంజ్‌ ఇండియా’ దాఖలు చేసిన పిటిషన్‌కు నేను మద్దతు ఇస్తున్నా’’ అని ట్విట్టర్‌లో తాప్సీ పేర్కొన్నారు. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘తప్పడ్‌’. ఆ టైటిల్‌కి తెలుగులో అర్థం ఏంటంటే... ‘చెంపదెబ్బ’. ఒక్క చెంపదెబ్బ కొట్టారని భర్త నుండి విడాకులు కోరే భార్య కథతో రూపొందిన చిత్రమిది. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.

Updated Date - 2020-02-23T06:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising