ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగరంలోనూ సగం!

ABN, First Publish Date - 2020-03-18T05:32:14+05:30

‘నేవీ’లో మగవారితో సమానంగా అవకాశాల కోసం సుదీర్ఘంగా సాగుతున్న పోరాటాల కెరటం ఎట్టకేలకు విజయతీరానికి చేరింది. ‘నేవీ’లో మహిళల అర్హతలను బట్టి అన్ని విభాగాల్లో అవకాశాలు కల్పించే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నేవీ’లో మగవారితో సమానంగా అవకాశాల కోసం సుదీర్ఘంగా సాగుతున్న పోరాటాల కెరటం ఎట్టకేలకు విజయతీరానికి చేరింది. ‘నేవీ’లో మహిళల అర్హతలను బట్టి అన్ని విభాగాల్లో అవకాశాలు కల్పించే దిశగా పర్మినెంట్‌ కమిషన్‌ను అనుమతించాలని సుప్రీంకోర్టు మంగళవారం (మార్చి 17) చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీంతో ఇక నుంచి ‘నేవీ’లో కూడా మహిళలు తమ సత్తా చాటుకునే అవకాశం లభించింది.


1994లో సంధ్యా సూరి ‘ఇండియన్‌ నేవీ’లో చేరినప్పుడు... ఆమె ప్రయాణించే నౌకలో 250 మంది సిబ్బంది ఉంటే, ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు మాత్రమే ఉండేవారు. అది కూడా లాజిస్టిక్‌ ఆఫీసర్లుగా మాత్రమే పనిచేయడానికి వారికి అవకాశం ఉండేది. మగ అఽధికారులు సంధ్యను తోటి ఉద్యోగిగా కాకుండా మహిళగానే చూసేవారు. ‘‘మనమంతా ఒకే డ్రెస్‌ వేసుకున్నాం. మనమంతా ఆఫీసర్లమే. జెండర్‌ దృష్టికోణంలోనే నన్ను ఎందుకు చూస్తారు?’’... ప్రతీ మీటింగ్‌లోనూ ఆమె ఇదే ప్రశ్న వేయాల్సి వచ్చేది. 


‘నేవీ’లో ప్రవేశించాలనుకునే మహిళలను జెండర్‌ కారణంగా చాలాకాలం దూరం పెట్టారు. సంధ్యలాంటి కొందరు మహిళా ఉద్యోగులు నేవీలో జెండర్‌ ఈక్వాలిటీ గురించి ఎంతోకాలంగా పోరాడుతూనే ఉన్నారు. అయితే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లాగా నేవీలో మహిళలు అన్ని విభాగాల్లో పనిచేయలేరనే భావనతో ఉద్యోగం చేస్తున్న కొద్దిమందిని కూడా మెడికల్‌, పారామెడికల్‌ వంటి పనులకే పరిమితం చేసేవారు. ‘మహిళలు నేవీలో పనిచేయాలంటే వారికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటుచేయడం కష్టమ’ని కొందరు నేవీ అధికారులు చెప్పేవారు. అయితే క్రమక్రమంగా నేవీలో మార్పులు చోటుచేసుకోక తప్పలేదు. ‘షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’ (ఎస్‌ఎస్‌సీ) కేటగిరిలో మహిళలకు నేవీలో స్థానం కల్పించారు. ఆ తర్వాత కూడా మహిళల పోరాటం ఆగలేదు. ఫలితంగా 2008-09లో చేరిన ఏడుగురు మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌ గ్రాంట్‌ చేశారు. ఈ పరిణామాల అనంతరం సుమారు 570 మంది మహిళలు నేవీలో పనిచేయడం మొదలెట్టారు. అయితే నేవీలో అర్హతలున్న మహిళలను మగవాళ్లతో సమానంగా ఆయా శాఖల్లో పనిచేసేలా అవకాశం కల్పించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది. దీంతో సాగరంలో కూడా తమ సత్తా చాటుకునేందుకు మహిళలకు మార్గం సుగమమైంది.

Updated Date - 2020-03-18T05:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising