ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియంత్రణలో ఉందాం!

ABN, First Publish Date - 2020-05-22T05:30:00+05:30

అవసరం లేని భౌతిక సామీప్యాలూ, అగత్యం లేని మాటలూ, అక్కర లేని ప్రయాణాలూ అనర్థం తెచ్చి పెడతాయని కరోనా వైరస్‌ మనల్ని హెచ్చరిస్తోంది. అయినా సరే, పని లేకపోయినా వీధుల్లోకి వెళ్ళాల్సిందేనని బయటకు వస్తున్న ఎంతో మందిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవసరం లేని భౌతిక సామీప్యాలూ, అగత్యం లేని మాటలూ, అక్కర లేని ప్రయాణాలూ అనర్థం తెచ్చి పెడతాయని కరోనా వైరస్‌ మనల్ని హెచ్చరిస్తోంది. అయినా సరే, పని లేకపోయినా వీధుల్లోకి వెళ్ళాల్సిందేనని బయటకు వస్తున్న ఎంతో మందిని మనం చూస్తున్నాం. ‘ఏదీ మన వరకూ రాదులే!’ అనే అతి విశ్వాసం కన్నా, ‘మన వరకూ వస్తే?’ అనే వివేకం ఉన్నప్పుడే ఈ విపత్తు నుంచి బయటపడగలం. తమ మీద తమకు నియంత్రణ లేనివారికి ఈ వివేకం ఉండదు. ‘‘పాడుపడి, ప్రాకారాలు లేని నగరం ఎలాంటిదో తనను తాను నియంత్రించుకోలేని మనిషి అలాంటివాడు!’’ అని బైబిల్‌ చెబుతోంది (సామెతలు 25:28). దేవుడు మానవుడికి ప్రసాదించిన శక్తులలో ఒకటి స్వీయ నియంత్రణ లేదా నిగ్రహం.


మనం చేస్తున్న పనుల మీదా, మాట్లాడే మాటల మీదా మనకు నియంత్రణ ఉండాలి. అది లేనప్పుడు చేయాల్సిన పనులు చేయడం మాట అటుంచి, అనవసరమైన ప్రలోభాలకు లొంగిపోతాం. మనసు చేసే గారడీలో పడిపోతాం. మానవులు చేసే పనుల మీద వారికి నియంత్రణ ఉండాలన్నది దేవుడి కోరిక. మనసును మనిషి నియంత్రించలేకపోతే, మనసే అతణ్ణి నియంత్రించి ఆడిస్తుంది. దైవ సమ్మతంగా జీవించడం అంటే -  మనపై మనకు నియంత్రణ కలిగి ఉండడం! దాని కోసం ప్రయత్నిద్దాం.

Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising