ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్రకళా విభూషణుడు!

ABN, First Publish Date - 2020-03-29T05:52:59+05:30

రంగుల ప్రపంచంలో ఆయన కుంచెకు ప్రత్యేక స్థానం ఉంది. భారత మాజీ ప్రధాని (ఐకే గుజ్రాల్‌) సోదరుడిగా కాకుండా, ఒక చిత్రకారుడిగా, శిల్పిగా, మ్యూరలిస్ట్‌గా సతీశ్‌ గుజ్రాల్‌ (94) భారతీయ చిత్రకళారంగంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగుల ప్రపంచంలో ఆయన కుంచెకు ప్రత్యేక స్థానం ఉంది. భారత మాజీ ప్రధాని (ఐకే గుజ్రాల్‌) సోదరుడిగా కాకుండా, ఒక చిత్రకారుడిగా, శిల్పిగా, మ్యూరలిస్ట్‌గా సతీశ్‌ గుజ్రాల్‌ (94) భారతీయ చిత్రకళారంగంలో తనదైన ముద్ర వేశారు. చిన్నతనంలో వినికిడి సమస్య కారణంగా పాఠశాలలో ప్రవేశం దొరకని కుర్రాడు చిత్రకళపై మక్కువను పెంచుకుని ఆ దిశగా అడుగులేశాడు. లాహోర్‌లోని ‘మాయో స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో అప్లయిడ్‌ ఆర్ట్స్‌ చేసిన తర్వాత సతీశ్‌ గుజ్రాల్‌ 1944లో ముంబయికి చేరుకున్నారు. ఆ తర్వాత స్కాలర్‌షిప్‌ సాధించి మెక్సికోలో తన కళకు మెరుగులు దిద్దుకున్నారు. దేశ విదేశాల్లో అనేక ఆర్ట్‌ షోల్లో పాల్గొన్న గుజ్రాల్‌ పెయింటింగ్స్‌, శిల్పాలు, మ్యూరల్స్‌ ప్రపంచవ్యాప్తంగా కొలువుదీరాయి. ఆయన వర్క్‌పై డజనుకు పైగా డాక్యుమెంటరీలు వచ్చాయి. 1999లో గుజ్రాల్‌ను భారతప్రభుత్వం ‘పద్మవిభూషణ్‌’తో గౌరవించింది. శుక్రవారం(27న) మరణించిన ఆయనకు చిత్రకళా రంగం నివాళులు అర్పిస్తోంది.



Updated Date - 2020-03-29T05:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising