ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫర్నిచర్‌ శుభ్రత కోసం...

ABN, First Publish Date - 2020-06-04T05:30:00+05:30

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఇంట్లోని బల్లలు, తలపు గడియలు, స్విచ్‌లు, నల్లాలను కూడా క్రిమిరహితం చేయడం మరచిపోవద్దు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఇంట్లోని బల్లలు, తలపు గడియలు, స్విచ్‌లు, నల్లాలను కూడా క్రిమిరహితం చేయడం మరచిపోవద్దు. 


  1.  ముందుగా చేతులకు డిస్పోజబుల్‌ లేదా ఉతికి తిరిగి ఉపయోగించే చేతితొడుగులు ధరించండి. 
  2. పరుపులు, సోఫాల మీది వస్త్రం తొందరగా రంగు మారదు. కాబట్టి వాటిని సబ్బుతో శుభ్రం చేస్తే సరిపోతుంది. 
  3. ఒకటికి రెండొంతలు చొప్పున 60శాతం ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌, 90 శాతం నీళ్లతో శానిటైజర్‌ తయారుచేయండి. లేదంటే లీటరు నీళ్లలో 7గ్రా.ల బ్లీజింగ్‌ పౌడర్‌ వేసి క్రిమిసంహారికని తయారు చేసుకోవచ్చు. 
  4. ఆ ద్రావణాన్ని ఫర్నిచర్‌, లోహంతో తయారైన తలుపు గడియలు, సెక్యూరిటీ లాక్స్‌ వంటి వాటిమీద స్ర్పే చేయండి. వస్త్రంతో తుడిచేయకుండా అలాగే ఆరనివ్వండి 
  5. డిజ్‌ఇన్‌ఫెక్టెంట్‌లో ముంచిన వస్త్రంతో బల్లల మీద, వాటి మూలల చుట్టూ తుడవండి. అయితే ఎక్కువ కోటింగ్‌  ఫినిషింగ్‌ ఉన్న సామగ్రి పాడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. 
  6. కదిలించడానికి వీలున్న ఫర్నిచర్‌ను కాసేపు ఎండలో ఉంచండి. దాంతో వాటి నుంచి వచ్చే చెడు వాసన పోతుంది. 
  7. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే తరచుగా శానిటైజర్‌తో వస్తువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది.
  8. ఫర్నిచర్‌ మొత్తం శుభ్రం చేయడం అయ్యాక గ్లౌజులు తీసేయ్యండి. చేతుల్ని సబ్బుతో 20 సెకన్ల పాటు కడుక్కోండి.

Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising