ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెరీర్‌ ప్రణాళిక వేసుకోండిలా...

ABN, First Publish Date - 2020-07-13T05:30:00+05:30

కరోనా వైర స్‌ ఆరోగ్యం ప్రాధాన్యాన్ని మరోసారి చాటడమే కాదు ఆర్థిక లావాదేవీలకు అడ్డుకట్ట వేసింది. ఉద్యోగ భద్రత లేని ఈ సమయంలో కొత్తగా కెరీర్‌ నిర్మించుకోవడం నిజంగా సవాలే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైర స్‌ ఆరోగ్యం ప్రాధాన్యాన్ని మరోసారి చాటడమే కాదు ఆర్థిక లావాదేవీలకు అడ్డుకట్ట వేసింది. ఉద్యోగ భద్రత లేని ఈ సమయంలో కొత్తగా కెరీర్‌ నిర్మించుకోవడం నిజంగా సవాలే. కానీ ప్రతీ కష్ట కాలం ఒక కొత్త ఆరంభానికి దారులు వేస్తుందనేది మరచిపోవద్దు. మీరు ప్రొఫెషనల్‌ అయినా, ఇప్పుడే డిగ్రీ పట్టా అందుకున్న వారైనా కెరీర్‌ ప్రణాళిక పకడ్బందిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు కెరీర్‌ నిపుణులు...


కెరీర్‌పై ప్రభావం: ప్రతి ఆపద, అవరోధ సమయం కొత్త ప్రారంభానికి సూచిక. ఈ కష్టసమయంలో మీరు ఉద్యోగం కోల్పోయి ఉంటే దాని ప్రభావం కెరీర్‌ మీద పడకుండా చూసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తిగా ఉన్నారా! లేదా మీకు ఇష్టం లేకున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేస్తున్నారా? అనేది తేల్చుకోవాలి. ఇష్టం లేని ఉద్యోగంలో కొనసాగేవారు కొత్త ఉద్యోగం చూసుకోవడమే కాదు పూర్తిగా సంతృప్తిని ఇచ్చే ఉద్యోగం వెతుక్కోండి. మీరు ఫ్రెషర్‌ అయినప్పటికీ కొత్తగా కెరీర్‌కు బాటలు వేసుకునేందుకు ఇదే అనువైన సమయం.


మీ నెట్‌వర్క్‌ పెంచుకోండి: కెరీర్‌ నిర్మించుకోవడంలో నెట్‌వర్క్‌కు ప్రాధాన్యం ఎక్కువే. అందుకే తప్పులు చేయకండి. మీ నెట్‌వర్క్‌ను పెద్దది చేసుకోండి. మీరు మితభాషి, సిగ్గరి అయినప్పటికీ కెరీర్‌లో దూసుకెళ్లాలంటే నెట్‌వర్కింగ్‌ తప్పనిసరి. మీ స్నేహితులు, మాజీ సహోద్యోగులు, కాలేజీ ఫ్రెండ్స్‌తో నెట్‌వర్క్‌ ఏర్పరచుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రొఫెషనల్స్‌తో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేయండి. ప్రస్తుతం వెబినార్ల హవా నడుస్తోంది కాబట్టి ఆన్‌లైన్‌ మీటింగ్స్‌ నిర్వహించండి. దాంతో కొత్త ఉద్యోగాలకు  సంబంధించిన సమాచారం లభిస్తుంది.


నైపుణ్యాలను అలవర్చుకోండి: కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల పలు అవకాశాలు చేతికందుతాయి. దాంతో కెరీర్‌లో బాగా రాణిస్తారు. ప్రొఫైల్‌లో మీ నైపుణ్యాలను ప్రస్తావించడం వల్ల మీకు కొత్త అవకాశాల దారులు తెలుస్తాయి. మీ కెరీర్‌ అశాజనకంగా లేనట్లు మీరు  భావిస్తే ఆన్‌లైన్‌లో కెరీర్‌ డెవలపింగ్‌కు సంబంధించిన కోర్సులు చేయండి. ప్రోగ్రామింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, ఆటోమేషన్‌ వంటి కోర్సులు నేర్చుకోండి. అలానే ఉద్యోగ భద్రత ఉన్న రంగాల్లో విజయం సాధించేందుకు అవసరమైన స్కిల్స్‌ అలవరచుకోండి.


కొత్త రంగంలో కెరీర్‌: మీరు ఉద్యోగంలో ఉన్న రంగంలో అవకాశాలు సన్నగిల్లుతున్నాయని తెలియగానే కొత్త రంగంలో కెరీర్‌ నిర్మించుకునే ప్రయత్నాలు మొదలెట్టండి. ఆ కెరీర్‌కు తగ్గట్టుగా మీ ప్రొఫైల్‌లో, నైపుణ్యాలలో మార్పులు చేసుకోండి. ఎందుకంటే కంపెనీలు కూడా మారుతున్న పరిస్థితులకు అనగుణంగా భవిష్యత్‌ అవసరాలకు పనికొచ్చే ఉద్యోగులకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అకడమిక్‌ పరంగా ప్రతిభావంతులైతే పరిశోధనల మీద దృష్టిసారించండి. యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌), నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)కు సన్నద్ధం అవ్వండి.


ఇంటర్న్‌షిప్‌లో చేరండి: మీరు ఫ్రెషర్‌ అయినట్టయితే తక్కువ, దీర్ఘకాల పరిమితితో ఏవైనా  కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నాయో తెలుసుకోండి. దాంతో కంపెనీలో పనిచేసిన అనుభవం సొంతమవుతుంది. పలు కంపెనీలు ఔత్సాహిక యువత కోసం ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ప్రాజెక్ట్‌తో కూడిన అసైన్‌మెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. ఒకవేళ మీపని తీరు నచ్చితే ఆ కంపెనీ వారే మీకు స్టైఫండ్‌ ఇస్తాయి. ఒక్కోసారి మిమ్మల్నే పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకొనే అవకాశాలు లేకపోలేదు.


Updated Date - 2020-07-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising