ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూపర్‌ రేసర్‌... న్యూకిమ్‌

ABN, First Publish Date - 2020-11-29T17:08:43+05:30

కోడి పందాలు, గుర్రపు పందాల్లాగే పావురాల పందాలు కూడా చాలా దేశాల్లో జరుగుతాయి. అందుకే రేసర్‌ పావురాలు కాస్త ఎక్కువ ధరకే అమ్ముడవుతాయి. కానీ మొదటిసారి ఒక పావురం ఎవరూ ఊహించని ధరకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడి పందాలు, గుర్రపు పందాల్లాగే పావురాల పందాలు కూడా చాలా దేశాల్లో జరుగుతాయి. అందుకే రేసర్‌ పావురాలు కాస్త ఎక్కువ ధరకే అమ్ముడవుతాయి. కానీ మొదటిసారి ఒక పావురం ఎవరూ ఊహించని ధరకు అమ్ముడై రికార్డు సృష్టించింది. 


న్యూకిమ్‌... ఒక ఆడ పావురం. బెల్జియం దాని నివాసం. మొన్నటికి మొన్న ఆన్‌లైన్‌లో పావురాల వేలం పాట సాగింది. అందులో న్యూకిమ్‌ కోసం ఇద్దరు చైనా దేశస్థులు పోటీ పడ్డారు. చివరికి అందులో ఒకరు 14 కోట్ల రూపాయలకు ఆ పావురాన్ని దక్కించుకున్నారు. పావురం కోసం అంత ఖర్చు పెట్టారా? అంటూ ప్రపంచమంతా ఆశ్చర్యపడింది. ఇంతకీ న్యూకిమ్‌ ఎందుకు అంత ధర పలికింది? ఎందుకంటే అది రేసింగ్‌లో ఆరి తేరింది. 2018లో జరిగిన అనేక పావురాల రేసింగ్‌లో విజేతగా నిలిచింది. జాతీయ స్థాయి పోటీల్లో మిగతా రేసింగ్‌ దిగ్గజాలను మట్టికరిపించింది. అన్నట్టు అది రెండు రేసింగ్‌ పావురాల సంకరంతో పుట్టింది. అంటే దాని తల్లిదండ్రులు కూడా సూపర్‌ రేసర్లన్నమాట. కేవలం పందాలలో పాల్గొనేందుకే దాన్ని సృష్టించారు. 


బెల్జియంలో ఉన్న హొక్‌ వాన్‌ డె వూవెర్‌ అనే వ్యక్తి ఇలా క్రాస్‌ బ్రీడ్‌లో పావురాలను సృష్టించి అమ్మకానికి పెడుతుంటాడు. న్యూకిమ్‌ కూడా అతనిదే. ‘పిపా’ అనే వెబ్‌సైట్‌లో తన దగ్గరున్న కొన్ని పావురాలను అమ్మకానికి పెట్టాడు. వాటిలో ఆ పావురాలు సాధించిన పతకాల చిట్టాను కూడా పొందుపరిచాడు. అందులో న్యూకిమ్‌ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇంతవరకు తాను అమ్మిన ఖరీదైనా పావురం ఇదేనని చెబుతున్నాడు వూవెర్‌. 

Updated Date - 2020-11-29T17:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising