ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన దేశం.. మన స్టయిల్‌

ABN, First Publish Date - 2020-09-09T05:30:00+05:30

ఫ్యాషన్‌ అంటే... పాశ్చాత్య డ్రెస్సులు వేస్తేనే వస్తుందనుకొంటారు చాలామంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాషన్‌ అంటే... పాశ్చాత్య డ్రెస్సులు వేస్తేనే వస్తుందనుకొంటారు చాలామంది. కానీ మనది వదిలేసి అరువు తెచ్చుకున్న దాన్ని పట్టుకొని వేలాడటమేంటంటారు బాలీవుడ్‌ నటి 


కంగనా రనౌత్‌. ఇటీవల ఆమె సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో, ఫొటోలు పోస్ట్‌ చేశారు. అందులో సంప్రదాయ మణిపురి ‘ఫానెక్‌’ ధరించి సరికొత్తగా కనిపించారు. ఆ చిత్రమే ఇది. ‘‘ఫ్యాషన్‌లో కొత్తదనాన్ని ఆహ్వానించాలి. కానీ మనవి వదిలేసి వేరెవరివో తెచ్చి కలుపుకోవడంలో అర్థం లేదు. జాతీయవాదానికి అసలైన అర్థం మన జాతికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం. భారత్‌లో పాశ్చాత్య ఫ్యాషనే ఫ్యాషన్‌ అనుకొంటారు. ఇతర దేశాల సంప్రదాయాలను ఇక్కడ అనుసరిస్తున్నాం. అదే సమయంలో మన సంస్కృతి, సంప్రదాయానికి అద్దం పట్టే చేనేత దుస్తులను విస్మరిస్తున్నాం’’ అంటూ కంగన ఆ వీడియోలో తన మనసులో మాట చెప్పారు. దానికి తగ్గట్టుగానే తరచూ ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ దుస్తుల్లో మురిపిస్తుంటారామె. భారతీయ ఆహార్యంలో ఉన్న అందం, నిండుదనం, సౌకర్యం మరే డ్రెస్సులతోనూ రాదనేది కంగన మాట.

Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising