ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లులు ఆందోళన చెందవద్దు!

ABN, First Publish Date - 2020-12-05T05:30:00+05:30

కొత్తగా తల్లి అయిన మహిళలు తమ చంటి బిడ్డ నిద్ర వేళల గురించి ఎక్కువగా కంగారుపడుతుంటారు. ఆరు నెలలు వచ్చేంత వరకు బిడ్డ రాత్రి పూట చక్కగా నిద్ర పోవాలని అనుకుంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా తల్లి అయిన మహిళలు తమ చంటి బిడ్డ నిద్ర వేళల గురించి ఎక్కువగా కంగారుపడుతుంటారు. ఆరు నెలలు వచ్చేంత వరకు బిడ్డ రాత్రి పూట చక్కగా నిద్ర పోవాలని అనుకుంటారు. అలా జరగనప్పుడు ఆందోళన చెందుతుంటారు. అయితే అలాంటి భయాలేవి అవసరం లేదని, ఆరు నెలల లోపు పిల్లల నిద్ర వేళల్లో మార్పులు సహజమేనని చెబుతోంది తాజా అధ్యయనం. ‘స్లీప్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో వచ్చిన ఈ అధ్యయనం సారాంశం ఏమిటంటే... కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మేరీ హెలెన్‌ పెన్నెస్ట్రీ బృందం ఆరు నెలల లోపు వయసున్న 44 మంది పిల్లల నిద్రవేళలను రెండు వారాలు పరిశీలించింది. ఆ రెండు వారాలు ఆ పసికందుల నిద్ర వేళలను డైరీలో రాయాల్సిందిగా వారి తల్లిదండ్రులను పరిశోధకులు కోరారు.


రెండు వారాల తరువాత కొందరు తల్లులు తమ బిడ్డ అయిదు రోజులు రాత్రిపూట ఆరు గంటలు నిద్రపోయిందని, మూడు రోజులు రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోయిందని చెప్పారు. అయితే అందరు పిల్లల్లో నిద్రవేళలు అందరిలోనూ ఒకేలా లేవు. అంతేకాదు ఒక రాత్రికి మరొక రాత్రికి వారి నిద్రలో తేడాలు ఉండడం, వీరిలో సగం మంది పిల్ల్లలు రాత్రిపూట 8 గంటల పాటు నిద్రపోలేదని పరిశోధకులు గుర్తించారు. ‘‘చిన్న పిల్లల్లో  ఎదిగే క్రమాన్ని బట్టి వారి నిద్ర వేళలు ఉంటాయి. అందుచేత తల్లులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తల్లులు పిల్లలకు సరిపోనూ పాలివ్వడం, వారి పక్కనే నిద్రించడం వల్ల పిల్లలు చక్కగా నిద్రపోయే అవకాశాలు ఎక్కువ’’ అంటున్నారు మేరీ హెలెన్‌.

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising