ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలే విజయ రహస్యాలు

ABN, First Publish Date - 2020-04-10T06:47:11+05:30

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలనుకున్న ప్రతి వ్యక్తీ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించి, ప్రేమతో ఆస్వాదిస్తూ ప్రతి కదలికలో పరిణతి సాధిస్తూ ముందుకు వెళతాడు. భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో ఎదుగుదలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలనుకున్న ప్రతి వ్యక్తీ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించి, ప్రేమతో ఆస్వాదిస్తూ ప్రతి కదలికలో పరిణతి సాధిస్తూ ముందుకు వెళతాడు. భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో ఎదుగుదలను, అభివృద్ధిని, అభ్యుదయాన్ని, చివరగా సంతృప్తితో కూడిన విజయాన్ని ఆస్వాదిస్తాడు. భక్తిశ్రద్ధలతో ఆచరించే పని ఏదైనా విజయాన్నిస్తుంది. భగవంతుని పట్ల త్రికరణశుద్ధిగా ఆర్ద్రత, విజ్ఞత, కృతజ్ఞతలతో చూపే సమర్పణ భావాన్ని ‘భక్తి’ అంటాము. భగవంతుని అనుగ్రహాన్ని స్వీకరించేందుకు హృదయాన్ని సన్నద్ధంగా ఉంచడమే ‘శ్రద్ధ’. శ్రద్ధ వల్ల ఆసక్తి, ఆసక్తి వల్ల నేర్చుకోవాలనే తపన.. పెరుగుతాయి.  నేర్చుకోవడం వల్ల పరిమితులు చెదిరిపోతాయి. భగవద్గీత వ్యక్తి స్వభావానుసరణంగా సాత్విక, రాజస, తామస శ్రద్ధలను పరిచయం చేస్తూ ఆయా శ్రద్ధలు కలవారిని దేవతలు, యక్షులు, రాక్షసులుగా విభాగిస్తుంది.

ఆధ్యాత్మిక విజయ సాధనా ప్రస్థానంలో ప్రముఖమైనది క్రమశిక్షణ. వ్యక్తిగత క్రమశిక్షణ, ఆలోచనలో పరిణతితో కూడిన క్రమశిక్షణ, చేసే పనిలో నిబద్ధతతో కూడిన క్రమశిక్షణ. ఈ మూడు అంశాలలో క్రమశిక్షణ పాటించగలిగిన వ్యక్తులే ఉన్నతస్థితిని సాధించగలుగుతారు. ఆ క్రమశిక్షణయే తపనను పెంచుతుంది ఆ తపన అన్వేషణకు మార్గం చూపుతుంది. అన్వేషణ ప్రజ్ఞను జాగృతం చేస్తుంది. నిజానికి ప్రజ్ఞ గొప్పదే కాని ప్రజ్ఞకన్నా అనుభూతి, అనుభూతి కన్నా అనుభవం, అనుభవంకన్నా అభివ్యక్తి ఉన్నతమైనవి. ఆ అభివ్యక్తి భక్తిశ్రద్ధలతో కలిస్తే భగవంతునికి దగ్గరగా తీసుకువెళుతుంది. 

ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియలో ఎదుర్కొన్న క్లిష్ట సమయాలు, సంక్షోభాలు.. ధైర్యంతో వాటినధిగమించిన విధానం మాత్రమే ఆ వ్యక్తి స్థానాన్ని నిర్ధారిస్తాయి. సమర్థుడైన గురువు సూచించిన మార్గంలో భక్తిశ్రద్ధలతో సాధన చేయడం, ఆత్మపరిశీలన, సమీక్షించుకోవడం, లోపాలను సరిచేసుకోవడం అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల విజయసాధన సులువవుతుంది. అవే.. వ్యక్తిని విపత్కర పరిస్థితులలో కూడా రక్షించి విజయానికి అవకాశాలను సృష్టిస్తాయి.

మన ప్రయత్నంలో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి వాక్కు, మనస్సు, కర్మల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విజయ సాధనలో ప్రముఖమైనది. ఆ ప్రక్రియలో మూడు ముఖ్యమైన అంశాలను గుర్తించాలి. మొదటిది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు సహాయపడిన ప్రతి వ్యక్తి సహకారాన్నీ గుర్తించడం.. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం. రెండవది... వారిని జ్ఞాపకం పెట్టుకోవడం. అంటే వారి సహకారానికి హృదయపూర్వకంగా స్పందించడం. మూడవది వారికి అవసరమైన సమయంలో మన శక్తి మేరకు సహకరించడం. మొదటిది వాచ్యం, రెండవది హృదయం ద్వారా స్పందించడం, మూడవది కర్మ ద్వారా ఆచరించడం.. ఈ ప్రక్రియ భౌతిక జీవితంలో కూడా విజయాన్ని ఇస్తుంది. దీనినే భక్తి శ్రద్ధలుగా చెప్పుకుంటాము.

- పాలకుర్తి రామమూర్తి, 9441666943


Updated Date - 2020-04-10T06:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising