ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మయే జ్ఞానం.. జ్ఞానమే ఆత్మ

ABN, First Publish Date - 2020-11-10T08:53:36+05:30

శుద్ధ జ్ఞానం అంటే.. విషయ వస్తువుల గురించి తెలుసు అనే వృత్తిని, తెలియదు అనే వృత్తిని అధిగమించిన చిత్‌ స్వరూపమే. సమస్తానికీ అతీతమైన, సర్వాత్మకమై, ఏకమైన చిత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్ఞానవర్జితా జ్ఞానహీన చిత్‌

జ్ఞానమస్తి కిం జ్ఞాతు మంతరం


శుద్ధ జ్ఞానం అంటే.. విషయ వస్తువుల గురించి తెలుసు అనే వృత్తిని, తెలియదు అనే వృత్తిని అధిగమించిన చిత్‌ స్వరూపమే. సమస్తానికీ అతీతమైన, సర్వాత్మకమై, ఏకమైన చిత్‌ స్వరూప ఆత్మను తెలుసుకునేందుకు వేరే జ్ఞానం ఏముంటుంది? ఏమీ ఉండదని దీని అర్థం. భగవాన్‌ రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల ఆత్మజ్ఞాన ప్రబోధ గ్రంథం ఉపదేశ సారంలోని 27వ శ్లోకమిది. ఈ లోకంలో జడమైనదేదీ మరొకదాన్ని తెలుసుకోలేదు. ఈ కాగితానికి తాను కాగితాన్నని తెలియదు. తనపైన ఉన్నవి అక్షరాలనీ తెలియదు. అలాగే జడమైన బుద్ధి కూడా దేనినీ తెలుసుకోలేదు. అయితే, ఆ బుద్ధి చిత్‌ ప్రకాశమైన ఆత్మతో కలిసి ఉండడం వల్ల బుద్ధికి చైతన్యం కలిగి కొన్ని విషయాలు తెలుసుకుంటుంది. కొన్నింటిని తెలుసుకోలేకపోతుంది. ఉదాహరణకు.. నీది ఏ ఊరు అని మనను ఎవరైనా అడిగితే ఫలానా ఊరు అని చెబుతాం. బిల్‌క్లింటన్‌ ఇప్పుడు ఏ ఊళ్లో ఉంటున్నాడు అని అడిగితే.. తెలియదు అంటాం. అంటే.. మన బుద్ధిలో తగిన సమాచారం ఉంటే ‘నాకు తెలుసు’ అంటాం. లేకపోతే ‘తెలియదు’ అంటాం. ఇక్కడ ‘నాకు తెలుసు’ అంటే.. బుద్ధికి తెలుసని అర్థం. ‘నాకు తెలియదు’ అంటే బుద్ధికి తెలియదని అర్థం. బుద్ధికి తెలుసనే విషయం, తెలియదనే విషయం కూడా ‘నాకు’ తెలుసు. తెలిసేది, తెలియనిది.. బుద్ధికే. ఎందుకంటే ‘నేను’ బుద్ధి కన్నా వేరుగా ఉండి, ఆ బుద్ధికి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని. చిత్‌ రూప చైతన్యాన్ని.


అంటే తెలుసును అనే జ్ఞానవృత్తిని, తెలియదు అనే అజ్ఞానవృత్తిని రెంటినీ తెలుసుకునేది శుద్ధ జ్ఞానస్వరూపం. అదే చిత్‌. అదే ఆత్మ. కనుక ఆత్మయే జ్ఞానం. జ్ఞానమే ఆత్మ. అది స్వయం ప్రకాశం. అది వెలుగుతూ అన్నింటికీ వెలుగునిచ్చేది. దాన్ని ప్రకాశింపజేయడానికి వేరొక వెలుగు అవసరం లేదు. సూర్యుని చూడడానికి వేరొక వెలుగు అక్కర్లేదు. అందుకే ఈ చిత్‌ను తెలుసుకోవడానికి వేరొకటి ఏమి ఉన్నది? ‘జ్ఞాతుం అంతరం కిం అస్తి?’ అని మహర్షి ప్రశ్నిస్తున్నారు. కనుక నిజమైన జ్ఞానమంటే ఆత్మను తెలియజేసేది కాదు. ఆత్మే జ్ఞానం. జ్ఞానం అనేది ఆత్మను పోగొట్టుకోవడానికిగానీ.. ఆత్మదర్శనానికి కాదు. 


దేవిశెట్టి చలపతిరావు, 

care@srichalapathirao.com

Updated Date - 2020-11-10T08:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising