ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలం... జగతికి మూలం

ABN, First Publish Date - 2020-09-25T05:38:22+05:30

మానవులకే కాదు, జంతు జాలానికీ, చెట్లకూ, క్రిమి కీటకాలకూ నీరే జీవాధారం. నీరు లేనిదే ప్రాణి, ప్రాణం లేవు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జలాన్నీ, దాని ద్వారా జీవాన్నీ, జీవితాన్నీ, ఉపాధినీ అందించిన అల్లాహ్‌కు కృతజ్ఞులమై ఉండాలి. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా ఆయనకు కృతజ్ఞత చెల్లించుకోవాలి.


మానవులకే కాదు, జంతు జాలానికీ, చెట్లకూ, క్రిమి కీటకాలకూ నీరే జీవాధారం. నీరు లేనిదే ప్రాణి, ప్రాణం లేవు. నీరు లేనిదే వనం లేదు. నీరు లేనిదే భవిష్యత్తు లేదు. అందుకే నీరు అమూల్యం. దాన్ని కాపాడుకోవాలనీ, పొదుపుగా ఉపయోగించుకోవాలనీ దైవ ప్రవక్త మహమ్మద్‌ 1400 సంవత్సరాల క్రితమే హితవు పలికారు. ‘‘పారే నది ఒడ్డున కూర్చున్నా సరే చుక్క నీటిని కూడా వృధా చేయకూడదు’’ అని ఆయన స్పష్టం చేశారు. 


సమస్త ప్రాణి సృష్టి నీటితోనే జరిగిందని దివ్య ఖురాన్‌ చెబుతోంది. ‘‘సంచరించే సమస్త ప్రాణులనూ అల్లాహ్‌ నీటితో సృష్టించాడు. వాటిలో కొన్ని పొట్ట ఆధారంగా పాకుతున్నాయి. కొన్ని రెండు కాళ్ళపైనా, మరికొన్ని నాలుగు కాళ్ళపైనా నడుస్తున్నాయి. అల్లాహ్‌ తను కోరిన దాన్ని సృజిస్తాడు. ఆయన నిశ్చయంగా ప్రతిదీ చేయగలిగిన సమర్థుడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ పేర్కొంటోంది. ‘‘నీటితో మానవుణ్ణి సృష్టించిన వాడు అల్లాహ్‌. అంతేకాదు, ప్రాణులు జీవించడానికి కావలసిన వాటన్నిటికీ జలాన్నే మూలంగా చేసుకున్నాడు. తన కరుణను చూపించడానికి ముందు ఆ శుభవార్తలను మోసుకుపోయే వాయువులను పంపేది ఆయనే. ఆ తరువాత, నీటితో నిండిన మేఘాలను ఆ వాయువులు తీసుకుపోతున్నప్పుడు వాటిని నిర్జీవంగా ఉన్న ప్రదేశాల వైపు ఆయన కదిలిస్తాడు. అక్కడ వర్షం కురిపించి, మృతప్రాయమైన ఆ భూమి నుంచీ రకరకాల పండ్లను వెలికి తీసుకువస్తాడు. ఆయన ఆకాశం నుంచి వర్షం కురిపించాడు. ఆ తరువాత దాన్ని ఊటలు, చెలమలు, నదుల రూపంలో భూమిలోకి ప్రవేశింపజేశాడు. ఆ నీటి ద్వారా భిన్నమైన రంగులతో ఉండే ఎన్నో పంటలను ఆయన పండిస్తున్నాడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ వివరిస్తోంది. ‘‘ఆకాశం నుంచి నీటిని వర్షింపజేస్తూ, మానవులకు వాటిని తనివితీరా తాగే అవకాశాన్ని ఇస్తున్నది ఆయనే. అందుకే ఆ సంపదకు యజమానులు మానవులు కాద’’ని చెబుతోంది. 


‘‘ఆకాశం నుంచి మేము శుభవంతమైన నీటిని అవతరింపజేశాం. తరువాత దాని ద్వారా తోటలనూ, పంట ధాన్యాలనూ, ఎంతో పొడవైన ఖర్జూరపు వృక్షాలనూ ఆవిర్భవింపజేశాం. వాటికి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇది దాసులకు ఉపాధిని ఇచ్చే ఏర్పాటు. ఈ నీటితో మేము మృత భూమికి ప్రాణం పోస్తాం’’ అని అల్లాహ్‌ స్వయంగా ప్రకటించారు (దివ్య ఖుర్‌ఆన్‌ - ఖాప్‌ 50:9-11)


కాబట్టి అపారమైన అల్లాహ్‌ శక్తిని అంగీకరించాలి. జలాన్నీ, దాని ద్వారా జీవాన్నీ, జీవితాన్నీ, ఉపాధినీ అందించిన ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా ఆయనకు కృతజ్ఞత చెల్లించుకోవాలి.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-09-25T05:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising