ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడే పండితుడు!

ABN, First Publish Date - 2020-09-25T05:42:21+05:30

మెడలో రుద్రాక్షలు వేసినంత మాత్రాన పండితుడు కాదు. మరి ఎవరు పండితుడు? ఎవరనేది భగవద్గీత నాలుగో అధ్యాయం పంథొమ్మిదో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెడలో రుద్రాక్షలు వేసినంత మాత్రాన పండితుడు కాదు. మరి ఎవరు పండితుడు? ఎవరనేది భగవద్గీత నాలుగో అధ్యాయం పంథొమ్మిదో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పాడు. 


యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః

ఈ ఒక్క శ్లోకం అర్థమైతే శివుడి మూడో కన్ను రహస్యం తెలిసినట్టే! ‘రుద్రాక్ష’ అనే మాట తాలూకు తాత్వికమైన జ్ఞాన సంపద మొత్తం ఈ శ్లోకంలో ఉంది. ‘యస్య’... ఎవరికైతే, ‘సర్వే సమారంభా’... అన్ని రకాల కోరికలు, ‘కామసంకల్పవర్జితాః’.. దాని సంకల్పంతో సహా విడిచిపోతాయో అంటే ఎవరైతే తమ అన్ని రకాల కోరికలను సంకల్పంతో సహా విడిచి పెట్టేస్తారో.. వారు ‘జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం’... అన్ని రకాల కర్మలను, వాటి వాసనలను జ్ఞానం అనే అగ్నితో దహించి పారేస్తారు. ‘తమాహుః పండితం బుధాః’... అలాంటి వాడిని మాత్రమే పండితుడు అంటారు. పండితుడు అంటే డాబుసరి వేషం వేసిన వాడు కాదు. మెడల నిండా రుద్రాక్షలు, తులసి మాలలు వేసిన వాడు కాదు. ఇదంతా బాహ్యవేషం. ఇది వద్దని కాదు. కానీ అతి కాకూడదు. జ్ఞానం అగ్నిలాంటిది. దాంతో కర్మలను దహించి వేయాలి. అగ్నితో దహించి వేయడమంటే రాసిన కాగితాలను దహించి వేయమని కాదు. కాగితాల గురించి, వాటిపై రాసిన విషయం గురించి, దాని ఫలితం గురించి ఆందోళనను దహించి వేయాలి.


‘జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం’ అంటే అదే! మెడలో రుద్రాక్ష వేసుకుంటే దాన్ని చూసుకున్నప్పుడల్లా ‘జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం’ గుర్తుకురావాలి. అందుకోసమే రుద్రాక్ష ధరించాలే తప్ప, ఏకముఖి రుద్రాక్షతో ఆ ఫలితం, పంచముఖ రుద్రాక్షతో ఈ ఫలితం అంటే నమ్మొద్దు. రుద్రాక్ష ధారణ కేవలం స్ఫూర్తి కోసమే!

- గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-09-25T05:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising