ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలం విలువ

ABN, First Publish Date - 2020-06-19T09:44:24+05:30

కాలం భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేది, హరించేది కాలమే. సృష్టి, స్థితి, వినాశం చేయగలిగింది కాలమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలః పచతి భూతాని, కాలం సంహరతే ప్రజాః

కాలః సుప్తేషు జాగ్రర్తి, కాలోహి దురతి క్రమః

(ఆచార్య చాణక్య)


కాలం భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేది, హరించేది కాలమే. సృష్టి, స్థితి, వినాశం చేయగలిగింది కాలమే. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి. అంటారు ఆచార్య చాణక్య.


కాలోహ్యయం నిరవధిః(కాలం అనంతమైనది) అంటూ భవభూతి చెప్పినా, ‘సమయమమూల్యమొక్క నిముషంబు వృథాచన గ్రమ్మరింప నేరము’ అంటూ దువ్వూరి హెచ్చరించినా అవి కాలం విలువను గ్రహించాలన్న ప్రబోధాలే. 


ప్రతి వ్యక్తీ అనంత కాలస్వరూప విన్యాసాన్ని, విలాసాన్ని గుర్తించి వ్యక్తిత్వ నిర్మాణానికి సాధనంగా చేసుకోవాలి. అత్యంత విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నతులమవుతాము. దురుపయోగం చేసుకుంటే పతనమవుతాం. నిరుపయోగం చేసుకుంటే విలువైన జీవితం వృథా అవుతుంది. ఏదైనా అది మన చేతులలోనే ఉన్నది.

కాలం వేరు, సమయం వేరు. కాలమనేది పరిణామం. సమయం.. కాల వ్యవధి. కాలం విలువ తెలిసిన వారే భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను సమన్వయం చేసుకోగలుగుతారు, విజయ సాధకులవుతారు. సాధకులకు ప్రేరణగా నిలుస్తారు. 


ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేందుకు అవసరమైన ఉపకరణమే జీవితం. పరిమితమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి అంటే ప్రభావవంతంగా ఆలోచించాలి, దక్షతతో పనిచేయాలి. దార్శనికత, మేధాశక్తి, నైపుణ్యం, ఊహాశక్తి, సమర్పణా భావన, పట్టుదలతో ప్రయత్నించడం వల్ల చేసే పనిపైనా, దానికి పట్టే సమయంపైనా అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహనయే కాలం విలువ తెలుసుకోవడం.


జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకోవాలి. ఒకప్పుడొక వ్యక్తి జీవిత కాలం శ్రమించి కోట్లు సంపాదించాడు. ఒకనాడు పోగైన సంపదను లెక్కిస్తూ. తన జీవితంలోకి తొంగిచూసుకున్నాడు. సంపాదన వెంట పరుగులు తీసే క్రమంలో తాను ఆ సంపదను అనుభవించలేదని, ఒక్క రోజూ ఆనందంగా లేనని గ్రహించాడు. ఆనందం విలువ తెలిసి ఇక పరివారంతో ఆనందించాలనుకున్నాడు. కానీ ఆ రాత్రి యమధర్మరాజు వచ్చాడు. గంట జీవితం కోసం మొత్తం సంపదను ఇస్తానని ప్రాథేయపడినా యముడు ఒప్పుకోలేదు. జీవితకాలం సాధించిన సంపదను వదలి.. అతడు వట్టి చేతులతో యముని వెంట వెళ్లాల్సి వచ్చింది.


కాబట్టి, దేని కోసం దేనిని విడిచి పెట్టాలో, ఏ కాలంలో ఏ పని చేయాలో తెలిసి ఆపని చేయడమే కాలాన్ని అవగాహన చేసుకోవడం. కనుక, కాలం విలువ తెలుసుకుని, శ్రమిస్తే విజయం తథ్యం.



- పాలకుర్తి రామమూర్తి, 9441666943

Updated Date - 2020-06-19T09:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising