ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోలీ పండుగ వెనుక అసలు రహస్యం!

ABN, First Publish Date - 2020-03-08T16:08:36+05:30

హోలీ.. హోలీ.. హోలీ.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ రంగుల్లో ముంచేసే పండగ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోలీ.. హోలీ.. హోలీ.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ రంగుల్లో ముంచేసే పండగ. ఆనందోత్సవాలతో జరుపుకునే ఈ పండగ వెనక ఎవరికీ తెలీని కథ దాగుంది. దసరా, దీపావళి పండగల్లాగే హోలీకి సంబంధించి ఓ కథ ఉంది. హిరణ్యకశిపుడికి సంబంధించిన కథ ఇది. చాలా మందికి తెలియని ఓ ఆసక్తికరమైన కథ. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. నిత్యం ఆయన నామస్మరణే చేస్తుండేవాడు. అయితే హరి అంటే హిరణ్యకశిపుడికి గిట్టదు. తన శత్రువైన విష్ణువునే నిత్యం జపించే కొడుకుని ఆ మార్గం నుంచి బయటకు తీసుకురావాలనుకుంటాడు. కానీ మాట వినకపోయేసరికి మంటల్లో పడేసి చంపాలనుకుంటాడు. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు కదా.. మంటల్లో నిలబడమంటే మాట వినడేమోనని.. హిరణ్య కశిపుడు ఒక పథకాన్ని రచించాడు. హిరణ్యకశిపుడికి హోలిక అనే సోదరి ఉంది. ఆమె దగ్గర ఒక మాయా వస్త్రం ఉండేదట. అది ధరిస్తే మంటల్లో నిల్చున్నా.. ధరించిన వారికి ఏమీ కాదు. దీంతో అతనితో పాటు సోదరి హోలికను కూడా మంటల్లో నుంచోమన్నాడు హిరణ్య కశిపుడు. 


మాయావస్త్రం కారణంగా చెల్లెలు హోలికకు ఏమీ కాదని, ఎలాంటి మాయా వస్త్రమూ లేని ప్రహ్లాదుడు మాత్రం కాలిబూడిద అవుతాడని హిరణ్య కశిపుడు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది పూర్తిగా వ్యతిరేకం. మంటల్లోంచి ప్రహ్లాదుడు నిక్షేపంగా బయటికి రాగా... హోలిక మాత్రం ఆహుతైపోయింది. దైవానుగ్రహం ఉన్నవారిని ఎవరూ ఏమీ చేయలేరని మరోసారి రుజువైంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా ఆ మరునాడు పండగ జరుపుకున్నారట. సంతోషకరమైన ఆ పండగని ఐదు రోజుల పాటు జరిపారట. చివరి రోజు రంగుల పంచమి. ఆ రోజు అందరూ రంగులు చిమ్ముకుని ఆనందించారు. అదే ప్రజలు చేసుకున్న తొలి హోలీ అంటారు. 

Updated Date - 2020-03-08T16:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising