ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బర్తిమయి విశ్వాసం!

ABN, First Publish Date - 2020-11-20T05:31:23+05:30

జెరికో నగరంలో బర్తిమయి అనే బిచ్చగాడు ఉండేవాడు. అతను అంధుడు. వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజు, వీధిలో పెద్ద అలజడి అతనికి వినిపించింది. జనం పరుగులు పెడుతున్నారు, అరుపులు, కేకలతో అంతా హడావిడిగా ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెరికో నగరంలో బర్తిమయి అనే బిచ్చగాడు ఉండేవాడు. అతను అంధుడు. వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజు, వీధిలో పెద్ద అలజడి అతనికి వినిపించింది. జనం పరుగులు పెడుతున్నారు, అరుపులు, కేకలతో అంతా హడావిడిగా ఉంది. బర్తిమయికి చూపు లేదు కాబట్టి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. పక్కన ఉన్నవాళ్ళను అడిగాడు. ఏసు ప్రభువు అటుగా వెళ్తున్నట్టు వాళ్ళు చెప్పారు. 


ఎందరో రోగగ్రస్థులనూ, పేదలనూ ఏసు ప్రభువు ఆదుకున్న కథలు అనేకం అప్పటికే బర్తిమయి విని ఉన్నాడు. కళ్ళు లేని దీన స్థితి నుంచి తనను రక్షించగలిగేవాడు ఆయనేనన్న నమ్మకంతో ‘‘దావీదు పుత్రుడా! యేసు ప్రభూ! నన్ను కరుణించు’’ అని గట్టిగా అరవసాగాడు. 

ఏసును చూసేందుకు వచ్చినవారు అతణ్ణి చీదరించుకున్నారు. అరవకుండా ఉండాలని హెచ్చరించారు. కానీ, బర్తిమయి తన ప్రయత్నం ఆపలేదు. మరింత గట్టిగా ‘‘ప్రభూ! నన్ను కాపాడు’’ అని మరింత గట్టిగా వేడుకున్నాడు.  ముందుకు నడుస్తున్న యేసు ఆ పిలుపు విని ఆగాడు. ‘‘ఆ వ్యక్తిని నా దగ్గరకు తీసుకురండి’’ అన్నాడు. 

‘‘ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ధైర్యం కూడదీసుకొని వెళ్ళు’’ అని అక్కడ చేరిన వ్యక్తులు బర్తిమయితో చెప్పారు. 

అంతా నిశ్శబ్దం అలముకుంది. బర్తిమయి తన పైవస్త్రాన్ని విడిచిపెట్టి, నేలపై నుంచి లేచి ఏసు వైపు నడిచాడు. అతన్ని సమీపించిన ఏసు ‘‘నీకు ఏం కావాలి?’’ అని అడిగాడు. 


‘‘ప్రభూ! నేను అంధుణ్ణి. నాకు చూపు ప్రసాదించు’’’ అని ప్రార్థించాడు బర్తిమయి.

‘‘నీ విశ్వాసమే నీకు స్వస్థత చేకూర్చింది’’ అన్నాడు ఏసు ప్రభువు. 


బర్తిమయికి వెంటనే చూపు తిరిగి వచ్చింది. ఏసు ప్రభువుకు అతను నమస్కరించాడు. తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయన వెంట నడిచాడు (మార్కు 10: 46-52)

బర్తిమయి అంధుడే కావచ్చు, బిచ్చగాడే కావచ్చు. తనను కాపాడేది ప్రభువేనన్న నమ్మకమే అతను పదే పదే వేడుకొనేలా చేసింది. దీనికి ఎందరు అడ్డుపడినా, చీదరించుకున్నా అతను ప్రయత్నం మానలేదు. అతని ఆర్తిలోని విశ్వాసాన్ని ఏసు గుర్తించాడు. అందుకే ‘‘నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది’’ అని చెప్పాడు. చూపు వచ్చేలా చేశాడు. ఎలాంటి అవరోధాలు వచ్చినా ప్రయత్నం మానకుండా... దైవం కరుణ తమపై కురిసేవరకూ ప్రయత్నించేవారే నిజమైన విశ్వాసులు. తమ కష్టాలను తీర్చేది దైవమేనని నమ్మిన వారి అభీష్టాన్ని దైవం నెరవేరుస్తాడనడానికి బర్తిమయి కథ ఒక చక్కటి ఉదాహరణ.

Updated Date - 2020-11-20T05:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising