ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్థం.. పరమార్థం

ABN, First Publish Date - 2020-09-11T05:30:00+05:30

శుభములు కలిగించువాడు శివుడు. శక్తిస్వరూపిణి అమ్మవారు. శక్తితో కలిసిన శివుడి శక్తి అపారం. సృష్టికి ప్రథమ కారణం. అద్వైత మార్గ ప్రవక్త ఆదిశంకరులు ప్రవచించిన ‘సౌందర్యలహరి’లోని ముఖ్యేద్దేశం శక్త్తిస్వరూపిణి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శుభములు కలిగించువాడు శివుడు. శక్తిస్వరూపిణి అమ్మవారు. శక్తితో కలిసిన శివుడి శక్తి అపారం. సృష్టికి ప్రథమ కారణం. అద్వైత మార్గ ప్రవక్త ఆదిశంకరులు ప్రవచించిన ‘సౌందర్యలహరి’లోని ముఖ్యేద్దేశం శక్త్తిస్వరూపిణి అయిన అమ్మవారిని స్తోత్రం చేస్తూనే శివశక్తి గొప్పదనాన్ని ప్రస్తుతించటమే! దీనిపై ఇప్పటికే అనేక రకాల వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిన్నింటికి భిన్నంగా- సౌందర్యలహరిలోని సూక్ష్మాన్ని సూక్ష్మరూపంలో అందించిన గ్రంథం- ‘ఆదిశంకరుల సౌందర్యలహరి’. ఆచార్య పప్పు వేణుగోపాలరావు దీనిని రచించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ శ్రీచక్ర’, ‘ఆదిశంకరుల జీవితచరిత్ర’ను రాసిన వేణుగోపాలరావు- అందరికీ అర్థమయ్యే సులభమైన భాషలో దీన్ని రాశారు. ఉదాహరణకు

  • నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
  • తవాపాంగాలోకే పతిత- మనుధావంతి శతశః
  • గలద్వేణీబంధాః కుచకలశ- విస్త్రస్త- సిచయా
  • హటాత్‌ త్రుట్యత్‌కాంచ్యో విగలిత- దుకూలా యువతయః 

- అనే శ్లోకానికి భిన్న అర్థాలు ప్రచారంలో ఉన్నాయి. 


‘‘అమ్మా! నీ కటాక్షవీక్షణాలకు పాత్రుడైనవాడు, ముసలి అయినా, కురూపి అయినా, శృంగారంలో మూఢుడైనా, అటువంటివాని వెనక వందల కొలది యువతులు, జుట్టు ముడి వీడిపోయినా, కలశముల వంటి కుచములపై పైట కొంగు జారినా, పోకముడి వీడినా సరే, వస్త్రాలు జారిపోతున్నా కూడా లెక్కచేయక పరిగెడతారు’’ అనేది ఈ శ్లోక తాత్పర్యం. అయితే ఈ శ్లోకం లోని అసలు అర్థం వేరు. ‘అమ్మవారిని పూజించే సాధకుడు ఎంత ముసలివాడు అయినా.. కురూపి అయినా.. యోగ్యుడు, యవ్వనం లేనివాడు అయినా ఆయన వెంట స్త్రీలు కామంతో పరిగెడతారు’ అనేది ఈ శ్లోకానికి ఉన్న మరొక అర్థం. దీనితో పాటుగా ‘సాధకుడు ఒక మెట్టు ఎక్కిన తర్వాత వాని వెంట స్త్రీలు కాదు... ముక్తికాంత తనంతట తానుగా వరిస్తుందనీ, వెంటబడుతుంద’నీ ఇంకొక అర్థం. ఇలాంటి వాటన్నింటినీ అందరికి అర్థమైన భాషలో వేణుగోపాలరావు చెప్పగలిగారు. 


ఆదిశంకరుల సౌందర్యలహరి

ప్రచురణ: వాక్కులమ్మ

ధర: రూ. 120

ప్రతులకు: 8179101133


Updated Date - 2020-09-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising