ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటి స్నేహాలు అనర్థం!

ABN, First Publish Date - 2020-12-11T07:47:02+05:30

జ్ఞానమార్గంలో ప్రయాణించాలంటే దుస్సాంగత్యం మానేయాలి. ప్రలోభ పెట్టే వాళ్లు, దురలవాట్లు ఉన్న వాళ్లతో స్నేహం మానేయాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్ఞానమార్గంలో ప్రయాణించాలంటే దుస్సాంగత్యం మానేయాలి. ప్రలోభ పెట్టే వాళ్లు, దురలవాట్లు ఉన్న వాళ్లతో స్నేహం మానేయాలి. ఆ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఓ పద్యం ద్వారా తెలుసుకుందాం.


అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించునంతలో

మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే

యనువుననైన దప్పవు యథార్థము తానది యెట్టులన్నచో

నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా




మనం ఎంత జ్ఞానులమైనా సరే అజ్ఞానులతో స్నేహం చేయడం వల్ల, అహంకారులతో స్నేహం చేయడం వల్ల, దురభ్యాసాలు ఉన్న వారితో స్నేహం చేయడం వల్ల ఆ జ్ఞానమంతా పోతుంది. ఎంత పుణ్యాత్ముడికైనా సరే, పాపాత్ముడితో స్నేహం చేస్తే అనుకోకుండా వాడికి జరిగిన అవమానం వీడికీ జరిగి తీరుతుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే ఇనుమును సాగదీయాలంటే ముందుగా కొలిమిలో పెట్టి ఎర్రగా కాలుస్తారు. ఇక్కడ సాగదీయాల్సింది దేన్ని! ఇనుముని! కానీ ఇనుముతో అగ్ని చేరడం వల్ల సమ్మెట దెబ్బలు అగ్నికి కూడా తగులుతున్నాయి. అందుకే స్నేహం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-12-11T07:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising