ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్లు ఆదర్శంగా ఉండాలి!

ABN, First Publish Date - 2020-03-27T05:30:00+05:30

ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్లు, ఇప్పటి భాషలో చెప్పాలంటే సెలబ్రిటీలు ఎలా ఉండాలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మూడో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకంలో చెప్పాడు. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్లు, ఇప్పటి భాషలో చెప్పాలంటే సెలబ్రిటీలు ఎలా ఉండాలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మూడో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకంలో చెప్పాడు. 

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరిస్తాడో, దాన్నే ఇతర జనులు కూడా అనుసరిస్తారు. ఆయన దేన్ని ప్రమాణంగా భావిస్తాడో, లోకమంతా దాన్నే అనుసరిస్తుంది. దీన్ని మనం నవజీవనంలో ఎలా ఉపయోగించుకోవాలంటే... ధర్మరాజు, భీష్ముడు, శ్రీరామచంద్రుడి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు గొప్పవాళ్లు అని ఒప్పుకుంటాం కానీ, వాళ్లను అనుసరించం. రామాయణం కళ్లకు అద్దుకుంటాం.. కానీ ఆచరించం. అందులో నీతిని అనుసరించం. ఇప్పుడు ‘శ్రేష్ఠుడు’ అంటే మంచివాడనే  అర్థం పోయింది. ‘సెలబ్రిటీ’ అనే అర్థం వచ్చేసింది. వివిధ రంగాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారిని ‘శ్రేష్ఠులు’ అంటున్నాం. శ్రీకృష్ణుడి కాలంలో ‘శ్రేష్ఠుడు’ అంటే అర్థం వేరే అయినా, ఇప్పుడు సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, క్రీడారంగంలో, ఆధ్యాత్మిక రంగంలో ప్రముఖులైన వారిని ‘శ్రేష్ఠులు’ అంటున్నాం. వీళ్ల ఆచారాన్ని జనం ఎప్పుడూ పరిశీలిస్తుంటారు. మూర్ఖంగా అనుసరిస్తుంటారు కూడా! ఇటువంటి దేశంలో కృష్ణుడు చెప్పిన దాన్ని జాగ్రత్తగా తీసుకొని సినిమా నటులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, ప్రవచనాలు చేసే వాళ్లు, స్వామీజీలు చాలా ఆదర్శంగా ఉండాలి. వ్యాపార లక్షణాలు, అవినీతి కార్యకలాపాలు ప్రముఖుల ఛాయలకు కూడా రావద్దు. ప్రముఖులను సామాన్య జనం చూస్తుంటారు, పరిశీలిస్తుంటారు. కాబట్టి ప్రముఖులు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలి.



డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-03-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising