ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి

ABN, First Publish Date - 2020-10-20T05:30:00+05:30

దేవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. చేతిలో అక్షయ అన్నపాత్ర ధరించి శివుడికి భిక్ష సమర్పిస్తున్న స్వరూపంలో ఆమె భక్తులను కరుణిస్తారు. దానాలలో అన్నదానం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్వయుజ శుద్ధ చవితి, మంగళవారం


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ!

నిర్ధూతాఖిల లోకపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ!

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ!

భిక్షాం దేహి! కృపావలంబనకరీ! మాతాన్నపూర్ణేశ్వరీ!!


దేవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. చేతిలో అక్షయ అన్నపాత్ర ధరించి శివుడికి భిక్ష సమర్పిస్తున్న స్వరూపంలో ఆమె భక్తులను కరుణిస్తారు. దానాలలో అన్నదానం అన్నిటికన్నా మిన్న. అన్నదాతకు మెతుకుకు ఒక రోజు చొప్పున కైలాస నివాసం (పుణ్యలోక నివాసం) కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అన్నదానం చేయడం వల్ల దారిద్య్ర నివృత్తి, స్వర్వదోష శాంతి కలుగుతాయి. అన్నదాతలకు అందరి దీవెనలు (‘అన్నదాతా సుఖీభవ’) ఉంటాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. ఆమె నిత్యాన్నదానేశ్వరి. సాక్షాత్తూ శివ స్వరూపిణి, ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత.


అన్నపూర్ణేశ్వరీదేవి అనుగ్రహంతో ఆయుష్షు, ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయనీ, ధన , ధాన్య వృద్ధి  కలుగుతాయనీ, కామ, క్రోదాధి అరిషడ్వర్గాలపై విజయం చేకూరుతుందనీ, మనసుకు సుప్రసన్నత, ఆనంద వృద్ధి కలుగుతాయనీ పెద్దల మాట. అన్నపూర్ణేశ్వరీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గాదేవిని దర్శించి, అమ్మవారి అనుగ్రహం పొందినవారు అన్నదాతలై తులతూగుతారనీ, జ్ఞాన వైరాగ్యాలు పొంది ముక్తిని సాధిస్తారనీ విశ్వాసం ఉంది.


నైవేద్యం: దద్ధ్యోజనం, కట్టె పొంగలి, పరమాన్నం

అలంకరించే చీర రంగు: పసుపు

అర్చించే పూల రంగు: తెలుపు

పారాయణ: చేయాల్సినవి: అన్నపూర్ణాష్టకం, స్తోత్రాలు

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising