ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మత్వమ్‌

ABN, First Publish Date - 2020-12-08T08:37:42+05:30

శరీర భావన నుండి బయటపడి, అంతరంగాన స్థిరపడుతున్నప్పుడే ఆత్మానుభవం మొదలవుతుంది. సర్వదేవతాతీత చైతన్యం పొడచూపుతుంది. జ్ఞానం మనకంటే భిన్నం కాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీర భావన నుండి బయటపడి, అంతరంగాన స్థిరపడుతున్నప్పుడే ఆత్మానుభవం మొదలవుతుంది. సర్వదేవతాతీత చైతన్యం పొడచూపుతుంది. జ్ఞానం మనకంటే భిన్నం కాదు. మనకు జ్ఞానానికి ఉన్న అభేద స్థితే అసలు సంగతి. సృష్టిలో జరుగుతున్న ప్రతి చలనమూ ఆత్మవిలాసమే. జరిగిపోయిన భూతకాలం, జరుగుతున్న వర్తమానం, జరగబోతున్న భవిష్యత్‌ కాలం.. వేరు వేరు కాదు. కదిలేదే కాలం. అది ప్రవహించే నది వంటిది. నడిపించే పరమాద్భుత శక్తి అది. కదలని ఆత్మకున్న అపరిమిత శక్తి, సర్వభువనాల సృష్టి, స్థితి, లయల చలన విన్యాసం. ఇది ఒక అద్భుత విన్నాణం. అది కళాత్మకం. నవరస భరితం. 


చూడడం, అనుభవించడం, అనుభూతి చెందడం సాధకుడి పని. యోగికి ఇవేవీ లేవు. ఆత్మనిష్ఠలో ఉండడమే అతడి పని. అగ్నితో కూడిన ఇనుము, అగ్నిలో దాగిన వేడిని గ్రహించి, తన కఠిన స్వభావానికి మెత్తందనాన్ని కలిగించుకున్నట్లు.. ఆత్మభావనలో మమేకమైన ఇంద్రియాలు ఆత్మత్వాన్ని సంతరించుకుంటున్నయ్‌. రాహుగ్రస్తమైన చంద్రుడు కనుమరుగౌతున్నాడు. చంద్రుడితో కలిసినప్పుడు అదే రాహువు ఛాయగా మిగిలిపోతున్నాడు. నీరు, నిప్పుల కలయికలోనూ ఇదే జరుగుతోంది. నిప్పు నీటిని వేడెక్కిస్తోంది. ఆ నీరే నిప్పును ఆర్పుతోంది. దేహం-ఆత్మల స్థితీ అంతే. దేహభావనలో ఆత్మ దేహం అవుతున్నది. ఆత్మభావనలో దేహం ఆత్మ అవుతున్నది. సాధన వల్లనే ఆత్మానుభూతి సాధ్యం. చెరకు నుండి చెరకు రసం, కట్టెల నుండి అగ్ని, పాల నుండి నెయ్యి.. ప్రయత్నం వల్లనే లభిస్తున్నాయి. శుద్ధ మనసులో ఆత్మ ప్రకాశమానమవుతుంది. ఆత్మ ఆద్యంత రహితం. అది చిజ్జడ గ్రంధి. అంటే చిత్‌, జడముల ముడి. ఎరుక బ్రహ్మమే. ప్రపంచం బ్రహ్మం. పిపీలికాది జీవరాశి సమస్తం బ్రహ్మం. సమస్త లోకాలూ బ్రహ్మమే.

- వీఎ్‌సఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-12-08T08:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising