ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శక్తిమంత్రం.. విపత్తుల నివారిణి

ABN, First Publish Date - 2020-04-24T08:48:57+05:30

భగవంతుడిని ఆత్మ శక్తిగా, సంయమ శక్తిగా, శారీరక మానసిక శక్తులుగా, దివ్య శక్తిగా, ధైర్య శక్తిగా, సహన శక్తిగా భావిస్తూ ఆయా శక్తులను ప్రసాదించమని ప్రార్థించే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఓం తేజోసి తేజో మయి దేహి!
  • వీర్యమసి వీర్యమ్‌ మయి దేహి! 
  • బలమసి బలం మయి దేహి!
  • ఓజోసి ఓజో మయి దేహి!
  • మన్యురసి మన్యుం మయి దేహి!
  • సహోసి సహో మయి దేహి! (శక్తి మంత్రం)


భగవంతుడిని ఆత్మ శక్తిగా, సంయమ శక్తిగా, శారీరక మానసిక శక్తులుగా, దివ్య శక్తిగా, ధైర్య శక్తిగా, సహన శక్తిగా భావిస్తూ ఆయా శక్తులను ప్రసాదించమని ప్రార్థించే మంత్రమిది. ఈ మంత్ర జపం వల్ల సాధకుడు తేజస్సంపన్నుడై ఒత్తిడులను సంభాళించుకునే శక్తిని సంపాదిస్తాడు. అలాగే ఋగ్వేదంలోని సూర్యసూక్తం కూడా సూర్యుడిని జీవితానికి ఆధారభూతునిగా, దేహానికి శక్తిగా, వర్షాన్ని, ఆహారాన్ని ఇచ్చేవాడిగా, ప్రపంచాన్ని రూపొందించి, పోషించేవాడిగా, పర్యావరణాన్ని కాపాడేవాడిగా, సకల కార్యాలనూ సాధించేందుకు ప్రేరణ శక్తిగా, ఉన్నత జీవనాన్ని ప్రసాదించే వాడిగా చెపుతుంది. అంతేకాదు.. చేసే పనిలో శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ వేదసూక్తాలు చెబుతాయి. వ్యక్తి తన మనసును, శరీరాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను వాటిని సాధించేందుకు అవసరమైన మార్గాలను సూచిస్తాయి. అక్షరాలుగా ఒకచోట కూర్చబడిన మంత్రాలకు ఈ శక్తి ‘నమ్మకం’ ద్వారా కలుగుతుంది. జీవన యాన కేంద్రం నమ్మకమైనప్పుడు అది అన్నింటినీ తనవైపు ఆకర్షించుకుంటుంది. పలికే ప్రతి అక్షరాన్నీ నిర్ణీత అంతరాలలో పలికినపుడు అవి మన కండరాలపై, నరాలపై, రక్తప్రసరణపై, గుండెపై తద్వారా శరీర ఆరోగ్యంపై మంత్రం తన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే పలికిన పదాలు సూచనలుగా మన మనసుపై ముద్రింపబడతాయి. ఆ ముద్రలు బలీయమైతే దానికి సంబంధించిన కార్యావిష్కరణకు దారి చూపుతాయి. మన మనసు చాలా శక్తివంతమైనది. అది మనమిచ్చుకున్న సూచనల కనుగుణంగా పనిచేస్తుంది. మనస్సు బలీయమైతే, శారీరక ధర్మాన్ని అధిగమించి ముందుకు సాగుతుంది. కాబట్టి వేద మంత్రాల రూపంలో ఉచ్చరించిన అక్షరాలు శారీరకంగా మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా లాంటి క్రిమి చేసే నష్టాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మానసిక, శారీరక సన్నద్ధతను ఈ వేద మంత్రాలు లేదా సూక్తాలు ఇస్తాయి. అయితే ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇవి వైద్యానికి అనుబంధంగా పనిచేస్తాయే కానీ ప్రత్యామ్నాయంగా జబ్బును తగ్గించేందుకు ఉపకరించవు. మనం ఈ మంత్రాలను ఉచ్చరించే సమయంలో వాటి అర్థాలను తెలుసుకొని వాటిని ఊహించ గలగాలి. ఎంత బాగా, దగ్గరగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాన్ని రాబట్టుకోగలం. కల్పన లేదా ఊహ మరియు నమ్మకం ఈ రెండూ ఒక పక్షికి రెండు రెక్కల లాంటివి. రెండూ బలంగా ఉన్న పక్షి ఆకాశంలో చక్కగా విహరించ గలదు. కాబట్టి నమ్మకాన్ని, కల్పనను ఆదరించి ఈ మంత్రాల ద్వారా ఉపశమనం పొందుదాం.

- పాలకుర్తి రామమూర్తి 9441666943


Updated Date - 2020-04-24T08:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising