ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాధకుని సాధనావిధానాలు

ABN, First Publish Date - 2020-08-07T09:28:47+05:30

నిత్యానిత్య వస్తు వివేకః ఇహాముత్రార్థ ఫలభోగవిరాగః! శమాదిషట్క సంపత్తిః ముముక్షుత్వంచేతి.. అని తత్వం బోధిస్తుంది. నిత్యం, అనిత్యం అయిన వస్తువులందు వివేకం, ఇహపరలోక భోగాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిత్యానిత్య వస్తు వివేకః ఇహాముత్రార్థ ఫలభోగవిరాగః! శమాదిషట్క సంపత్తిః ముముక్షుత్వంచేతి.. అని తత్వం బోధిస్తుంది. నిత్యం, అనిత్యం అయిన వస్తువులందు వివేకం, ఇహపరలోక భోగాలను కోరకుండా ఉండడం, శమము ఆదిగాగల ఆరు సంపదలను కలిగి ఉండడం, మోక్షాన్ని పొందాలనే ఆకాంక్ష చిత్తమందు దృఢంగా ఉండటం అనే నాలుగు విధానాలు సాధకుని సాధనలో అత్యవసరాలని ఈ శ్లోకం అర్థం. ఆ విధానాలే సాధన చతుష్టయాలు. ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ అనే నిత్య సత్యాన్ని అన్నమయ్య తన పదకవిత ద్వారా నిరూపించాడు. నిత్యం, సత్యం, సనాతనం అయిన పరబ్రహ్మ స్వరూపం బ్రహ్మాండమంతా ఆవరించి ఉంది. అలాంటి ఆత్మానందతేజోమయ స్వరూపమగు బ్రహ్మ విద్యపై పట్టు సాధించాలి. అనిత్యమైన వస్తువులపై భ్రమవిడనాడాలి. అదే నిత్యానిత్యవస్తువివేకం.


‘‘ఇహస్వర్గభోగేషు ఇచ్ఛారాహిత్యం’’ ఇహలోకంలో, స్వర్గలోకంలో ఉండే భోగాలపట్ల ఆసక్తి వదలవేయాలి. ఈ రెండు లోకాల్లో అనుభవించే సుఖాలు అశాశ్వతాలు. యజ్ఞయాగాలు.. దానధర్మాల ద్వారా పుణ్యం సంపాదించినవారు మరణానతరం స్వర్గంలో భోగాలు అనుభవించి.. పుణ్యఫలం ముగిసిన తర్వాత జగతిలో జన్మించాలి. అయితే.. మరుజన్మలేని స్వస్వరూపమైన ఆత్మను తెలిసికొని వర్తించడం శ్రేయోదాయకం. శమము, దమము, ఉపరతి, తితిక్ష (ఓర్పు), శ్రద్ధ, సమాధానం అనేవి ఆరు శమాదులు. అరిషడ్వర్గాలనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మానవునికి అంతఃశత్రువులు. మనస్సు దురలవాట్లను మానేలా చేసే గుణమే శమము. శరీరమనే రథానికి ఇంద్రియాలు గుర్రాలని, మనస్సు పగ్గాలని ఆత్మతత్వ విచారణలో చెప్పబడింది. ప్రతిఫలాన్ని త్యజించి పనులు చేయడం వల్ల ఇంద్రియాలకు సత్ఫలితం సిద్ధించడమే దమము. అనుచితమైన పనులను ఒకసారి వదలివేసి, మరలా చేయకపోవడమే ఉపరతి.


శీతోష్ణ సుఖ దుఃఖాలనే ద్వంద్వాలను సహించుకోవడమే తితిక్ష లేక ఓర్పు. సద్గురువు బోధన, వేదాంతసార సంగ్రహణలందు అచంచలమైన విశ్వాసం ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు. కార్యాచరణకు విశ్వాసం తప్పనిసరి. ‘శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం’ అనే భగవద్గీత వాక్యం శ్రద్ధగలవానికి జ్ఞానం అతిశీఘ్రంగా లభిస్తుందనే అర్థాన్ని తెలుపుతోంది.


‘‘మోక్షోమే భూయాత్‌ ఇతి ఇచ్ఛా’ అనే తత్వబోధ ప్రకారం.. నాకు మోక్షం కలుగుగాక అనే వాంచితమే ముముక్షుత్వం. ఇది ప్రథమంలో పటిష్ఠంగా ఉండదు. అనంతరం నిష్కామకర్మలాచరించడంవల్ల, ఆత్మతత్వ విచారణవల్ల చిత్తంపరిశుద్ధమై ఏకాగ్రతగల్గి వివేకవైరాగ్యాదులు వశమై ఆసక్తి అత్యధికమౌతుంది. సాధన ఫలితంతో మోక్షం లభిస్తుంది.


 విద్వాన్‌ వల్లురు చిన్నయ్య

Updated Date - 2020-08-07T09:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising