ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్యాగమే మిన్న!

ABN, First Publish Date - 2020-02-21T06:14:25+05:30

దాతృ గుణం కన్నా ఉన్నతమైనది త్యాగ భావం. తన అవసరం తీరగా మిగిలిన దాంట్లోంచీ ఇతరులకు ఇచ్చేవాడు దాత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాతృ గుణం కన్నా ఉన్నతమైనది త్యాగ భావం. తన అవసరం తీరగా మిగిలిన దాంట్లోంచీ ఇతరులకు ఇచ్చేవాడు దాత. కానీ తనకు అవసరం ఉన్న దాన్ని కూడా ఇతరులకు ఇవ్వడం త్యాగం. అదే త్యాగధనుడి విశిష్టత. ఇది గొప్ప పుణ్యకార్యాల కోవకు చెందుతుంది. ఈ సద్గుణం ఉన్న మదీనా అన్సార్లను అల్లాహ్‌ ఎంతో ప్రశంసించాడు. అన్సార్లు తమ సొంత లాభం కన్నా ముహాజిర్లకు (దైవ మార్గాన్ని అనుసరిస్తూ మక్కా నుంచి మదీనాకు వలస వచ్చిన వారికి) ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. తాము పేదరికాన్ని అనుభవిస్తున్నా ముహాజిర్లను ఆదుకొనేవారు. 


మహా ప్రవక్త మహమ్మద్‌ అందరి కన్నా అధికంగా దానాలు చేసేవారు. స్వయంగా పేదరికంలో జీవనాన్ని గడుపుతున్నప్పటికీ, చక్రవర్తులే సిగ్గుపడేలా దానధర్మాలు చేసేవారు. ఆయనకు ఒక దుప్పటి ఎంతో అవసరం ఉన్న సమయంలో ఒక మహిళ ఆ సంగతి గమనించింది. ఆయనకు దుప్పటి బహూకరించింది. దాన్ని ఆయన కప్పుకున్నారు. అంతలోనే ఒక వ్యక్తి వచ్చి అడగడంతో ఆ దుప్పటిని మహమ్మద్‌ అతనికి ఇచ్చేశారు. 


‘‘తనకు అవసరం ఉండి కూడా ఒక వస్తువును ఇతరులకు ఏ వ్యక్తి ఇస్తాడో అతని అపరాధాలను అల్లాహ్‌ క్షమిస్తాడు’’ అని మహా ప్రవక్త తెలిపారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-02-21T06:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising