ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గైడెడ్ మెడిటేషన్’ ఆర్కే మఠ్ ఆన్ లైన్ క్లాసులు

ABN, First Publish Date - 2020-09-23T22:01:21+05:30

రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ధ్యాన తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ధ్యాన తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ‘గైడెడ్ మెడిటేషన్’ పేరిట ఆన్ లైన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం.. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 26 వరకు 21 రోజుల పాటు జరగనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7.30 నుంచి 8.00 గంటల వరకు క్లాసులు ఆన్ లైన్‌లో జరగనున్నాయి. 16 ఏళ్ల పైబడిన అందరూ ఈ తరగతులకు అర్హులు. మెదడు పనితీరు మెరుగవ్వాలన్నా.. ఒత్తిడి లేని జీవితం గడపాలన్నా.. సంతోషంగా ఉండాలన్నా.. వీటన్నింటికీ పరిష్కారం ధ్యానమే. ఏకాగ్రతా రహస్యం, ఆలోచనల నియంత్రణ, ఒత్తిడిని తగ్గించుకోవడమెలా.. వంటి అంశాలు ఈ క్లాసులలో నేర్పించనున్నరని స్వామి బోధమయానంద తెలిపారు. స్వామీజీ శిక్షణ ఇవ్వనున్నారు.   


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.  


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

 

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-09-23T22:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising